కరోనా కాలంలో.. ఏటీఎంలో 100 బదులు 500 నోట్లు వస్తున్నాయనే సమాచారం వింటే ఎవరైనా ఊరుకుంటారు.. చెప్పండి. అవునా.. అంటూ ఎగిరి గంతేస్తాం.. వనపర్తి జిల్లా అమరచింతలోనూ ఇలాంటే పరిస్థితే నెలకొంది. అక్కడ ఇండియావన్ ఏటీఎం ఉంది. ఏ ఏటీఎం దగ్గర లేని జనాలు అక్కడ ఎగబడటం చాలామందికి ఆశ్చర్య కలిగించింది. తీరా విషయం ఎంటో తెలుసుకొని షాక్ తిన్నారు. 100 నోట్లకు బదులు 500 నోట్లు వస్తుండటంతో గుంపుగుంపులుగా ఎగబడ్డారు. మొదట ఓ కస్టమర్ 4 వేల డ్రా చేయగా, 20 వేలు అందాయి. దీంతో వార్త అందరికీ తెలిసింది. ఇంకేముంది నిమిషాల్లోనే డబ్బును డ్రా చేశారు. దాదాపు 5.88 లక్షల మేర అతనపు విత్‌డ్రావల్స్ జరిగాయి. విషయం సంబంధిత నిర్వాహకులకు తెలియడంతో ఎటీఎంకు తాళం వేశారు. సాంకేతిక లోపం కారణంగా 500 నోట్లు వచ్చాయని తెలిపారు.
Must Read ;- వీడి కక్కుర్తి పాడుగాను : ఏటీఎంలో శానిటైజర్ దొంగతనం, వీడియో వైరల్!











