ఏడు పదుల వయసు ఐనప్పటికీ ఓ యువకుడిలా కష్టపడుతుంటారు చంద్రబాబు. ఈ విషయం ఇటీవలి దావోస్ పర్యటనలోనూ నిజమైంది. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా తాననుకున్నది సాధించే వరకు ముందుకు సాగుతారు చంద్రబాబు. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో మీడియాతో చిట్‌చాట్ చేసిన శ్రీధర్ బాబు..చంద్రబాబు విజన్‌కు సెల్యూట్ కొట్టారు.
చంద్రబాబు మంచి ప్లాన్‌తో దావోస్ వచ్చారన్నారు శ్రీధర్ బాబు. ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన వనరులు ఉన్నాయని, పొడవైన సముద్ర తీరం ఉండడంతో ఏపీకి పరిశ్రమలు క్యూ కట్టే అవకాశం ఉందన్నారు. ఎంవోయూలు చేసుకున్న వాటిపై ఎందుకు ప్రకటన చేయలేదని లోకేష్‌ను అడిగితే..ఆ వివరాలను ఏపీ వేదికగానే ప్రకటిస్తామని తనతో చెప్పారన్నారు శ్రీధర్ బాబు. ఈ ప్రకటనతోనే చంద్రబాబు టీం పకడ్బందీ ప్లాన్‌తోనే దావోస్‌కు వచ్చిందన్న విషయం అర్థమైందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అల్టిమేట్ అంటూ పొగడ్తలు కురిపించారు శ్రీధర్ బాబు. దావోస్‌లో చంద్రబాబు చాలా పెద్దరికంతో వ్యవహరించారని చెప్పుకొచ్చారు శ్రీధర్ బాబు. హైదరాబాద్ అభివృద్ధిని డిస్టర్బ్ చేయాలనే ఆలోచన చంద్రబాబులో ఏ మాత్రం లేదన్నారు శ్రీధర్ బాబు.
ఇక దావోస్‌లో మైనస్ 8 నుంచి మైనస్ 11 డిగ్రీల చలిలోనూ చంద్రబాబు స్వెటర్ వేసుకోకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు శ్రీధర్ బాబు. మేమంతా స్వెటర్లు, జాకెట్లు వేసుకుంటే ఆయన మాత్రం ఇక్కడిలాగే సాధారణ దుస్తుల్లో పెట్టుబడుల వేట కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ఈ వయసులోనూ చాలా ఉత్సాహంగా, ఫిట్‌గా ఉన్నారని, యువతరానికి ఆయన ఓ స్ఫూర్తి అంటూ ప్రశంసలు కురిపించారు. సీ పోర్ట్ ఉండడంతో ఏపీకి చాలా పెద్ద ప్లస్ అని, దాన్ని తట్టుకుని తెలంగాణ పెట్టుబడులు సాధించడం టాస్క్ అన్నారు. ఇక ఎవరు అధికారంలో ఉన్న అభివృద్ధి విధానాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు శ్రీధర్ బాబు. కానీ జగన్ అందుకు వ్యతిరేకంగా పని చేశారని గుర్తు చేశారు శ్రీధర్ బాబు.











