నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్డి ఫ్యామిలీకి మంచి పేరుంది. ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఎంతో పేరున్న వ్యక్తి. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో శ్రీనివాసులు రెడ్డి మంత్రిగానూ పని చేశారు. అలాంటి శ్రీనివాసులు రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి పేరు మసకబారేలా చేస్తున్నారు.
వివాదం ఏంటి –
కోవూరు నియోజకవర్గ వైసీపీ సమావేశంలో మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి…వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళ అన్న విచక్షణ లేకుండా ఆమె వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా మాట్లాడారు. ఆ పనుల్లో ఆమె PHD చేశారంటూ మరో అర్థం వచ్చే రీతిలో కామెంట్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
దీంతో వేమిరెడ్డి అభిమానులు నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఫర్నీచర్, కార్లు ధ్వంసం చేశారు. దాడి జరిగిన సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరు. ఐతే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిని ఎవరు సమర్థించరు..కానీ అదే సమయంలో ఓ మహిళపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా సమర్థించరు.
వైసీపీ మొదటి నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. మహిళలంటే ఆ పార్టీ నాయకులకు ఏ మాత్రం గౌరవం ఉండదు. మహిళలను కించపరిచేందుకు ఏ స్థాయికైనా దిగజారుతారు. అదే పద్ధతిలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల టైంలోనూ ప్రశాంతి రెడ్డిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు ప్రసన్న. ఆ విమర్శలతో అప్పుడే తన జీవితం గురించి వివరణ ఇచ్చారు ప్రశాంతి రెడ్డి. ఆమె మొదట నల్లపురెడ్డి ఇంటికే కోడలిగా వెళ్లారు. కానీ భర్త చనిపోవడంతో వేమిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఐనప్పటికీ ప్రసన్నకుమార్ రెడ్డి తీరు మార్చుకోలేదు. మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేయడంతో వేమిరెడ్డి అభిమానులు హర్ట్ అయ్యారు.
ఇక వైసీపీ అధికారం కోల్పోవడానికి మహిళలను కించపరచడం కూడా ఓ కారణం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని నిండు అసెంబ్లీలో అవమానించారు. దాంతో చంద్రబాబు కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. ఇక మూడు పెళ్లిళ్లంటూ పవన్‌కల్యాణ్‌ను ఎగతాళి చేశారు. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగే ప్రయత్నం చేశారు. ఇంత జరిగిన వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదు.











