సోషల్ మీడియాలో మెగా కుటుంబానికి మెగా హస్తమే. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే ఆయన తనయుడు రామ్ చరణ్ ఈ విషయంలో తండ్రిని మించి పోయాడనే చెప్పాలి. తన ఫాలోయర్స్ ను పెంచుకోవడం లో మంచి దూకుడును ప్రదర్శిస్తున్నారు. తన పుట్టిన రోజైన మార్చి 27న రామ్ చరణ్ ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు. ఇక్కడ సరికొత్త రికార్డు రామ్ చరణ్ సొంతమైంది.
అదేమిటంటే ఆయన ఫాలోయర్స్ 10 లక్షలకు చేరుకున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఆయన సాధించిన ఘనత ఇది. తక్కువ కాలంలో ఈ రికార్డును సృష్టించుకున్నారు. కేవలం 233 రోజుల్లో అతను ఈ ఘనతను సాధించుకోవడంతో ఇది ఓ రికార్డుగా మారింది. మెగా అభిమానులకు మాత్రం ఇది పండుగ లాంటి వార్తే. ప్రస్తుతం రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ షూటింగులో ఉన్నాడు. త్వరలో ‘ఆచార్య’ షూటింగులోనూ పాల్గొనబోతున్నాట్లు సమాచారముంది.
Click Here for All New Titles Releasing Directly on OTT (List Updates Daily)