టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకడంతో ఆందోళన చెందారు. దాంతో హైద్రాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు కోలుకున్నారు. అయితే రాజశేఖర్ ఆరోగ్యం విషమించడంతో అభిమానులు కలవర పడ్డారు. గత కొద్దిరోజులుగా క్రమేపీ ఆయన ఆరోగ్యం మెరుగు పడుతూ వస్తోంది. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్స్ విడుదల చేశారు.
తాజాగా రాజశేఖర్ హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయ్యారు. కరోనా నెగెటివ్ రావడంతో తిరిగి ఆయన ఆరోగ్యంగా ఉండడంతో ఆయన్ను డిస్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని రాజశేఖర్ భార్య జీవిత తెలియచేశారు. తమ కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి, అలాగే వైద్య సిబ్బందికి జీవిత ధన్యవాదాలు తెలిపారు.











