ఆదుకోవాల్సిన వారే అణగతొక్కితే ఎలా?
కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా .. బీజేపీ ఉన్నా దక్షిణ భారతంలోని ఏపీపైనా చిన్నచూపే. ఎందుకంటే ఇక్కడి రాజకీయాలు అంత హీనంగా.. లోపభూయిష్ట ఎజెండాలతో ఉంటాయి కాబట్టి. ఎప్పుడూ అధికారంలో ఉండాలని రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి పీఠంపై 30 ఏళ్లు
మేమే ఉండాలని నాయకులు పన్నే వ్యూహాలు రాష్ట్ర పురోగతి, భవిష్యత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికారపార్టీ రాజకీయాలు చూసినా అదే గోచరిస్తోంది. జగన్ రెడ్డి ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఢిల్లీలో పవర్ స్వీచ్ పెట్టారు. అక్కడ నొక్కితే కానీ .. ఇక్కడ ఏ విషయంలో అడుగులు పడని వైనం. ఇది ఏపీ ప్రజలకు ఎప్పుడో అర్థమై ఇలాంటి అసమర్థ నేతను ఎన్నుకున్నామని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే విభజన హామీలను కేంద్రం తుంగన తొక్కింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయం, విశాఖ రైల్వే జోన్ అంశం తెరవని దస్త్రం మాదిగా అలా పడిఉన్నాయి. దీనిని ప్రశ్నించే పాలకులేరు… నిలదీసే సాహసవంతులైన నాయకులు లేరు. రాష్ట్ర ప్రయోజనాలను స్వార్థ రాజకీయాలకు తాకట్టు పెట్టే పాలకులు ఉన్నంత కాలం ఏపీ ప్రజల తలరాతలు మారవు అన్నది సత్యం. అనేక మంది బలిదానాలపై పునాదులు వేసి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రం నిర్ణయాలకు తానా తందానంగా అంటోంది. కార్మికులు త్యాగాలను, ఉద్యమాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తాం అంటూ కేంద్రం భీష్మించడం ప్రజలు ఆగ్రహావేశాలతో చలికాసుకున్నట్లే అన్న కటిక నిజం అతి త్వరలోనే తెలిసివస్తోంది.
ఈ నెలాఖరు నాటికి ఉక్కు ప్రైవేటీకరణకు పక్కా ప్లాన్ !
ఈ నెలాఖరు నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం మౌనం వహిస్తోంది అన్నది వాస్తవం. ప్లాంట్ ను పార్ట్స్ పార్ట్స్ గా విభజించి అమ్మకానికి పెట్టేందకు కేంద్రం కుట్రలు చేస్తోంది. ప్లాంట్ లో కీలకమైన కోక్ ఓవెన్ విభాగంలో రెండు బ్యాటరీల నిర్వహణ బాధ్యతలను ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ఈ నెల 1న ప్రకటన చేసింది. ఈ నెలాఖరు నాటికి బిడ్లు వేస్తే వాటిని ఖరారు చేసి రూ. 3 వేల కోట్ల విలువైన బ్యాటరీలను అప్పగిస్తారు. అక్కడ పనిచేస్తున్న దాదాపు 200 మంది ప్లాంట్ ఉద్యోగులను వేరే విభాగాలకు పంపిస్తారు. వీరి స్థానంలో కాంట్రాక్టు పొందిన సంస్థ సిబ్బంది అక్కడ పనిచేస్తారు. వీరికి జీతాలు, కోక్ తయారీకి అవసరమైన కోల్ అంతా యాజమాన్యమే ఇస్తోంది. అంటే కేవలం కాంట్రాక్ట్ పొందిన సంస్థ నిర్వహణ బాధ్యతలను మాత్రమే చూస్తోంది అన్నది క్లియర్. అత్యతం కీలకమైన విభాగం ప్రైవేటీకరణ చేస్తే, దాని ప్రభావం ప్లాంట్ మొత్తం పడకమానదు అని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యూహాన్నే యాజమాన్యం ఎత్తుగడగా చేసుకుని ముందుగా కోక్ ఓవెన్ బ్యాటరీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తోందని అందరికి అర్థమయ్యే అంశమే. గడిచిన 34 ఏళ్ల నుంచి కార్మికులు కోక్ ఓవెన్ బ్యాటరీ విభాగాన్ని చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. అటువంటి ఈ విభాగాన్ని ఒక పక్కా కుట్రతో ప్రైవేటీకరణ చేస్తోంది కేంద్రం. కోల్, జీతాలు కూడా యాజమాన్యమే ఇచ్చి దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన రెండు కోక్ ఓవెన్ బ్యాటరీలను ప్రైవేటుకు అప్పగించాలని ప్రయత్నించడం ఏమిటని కార్మిక సంఘం జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.











