వైసీపీలో బూతు రాజాలుగా గత అయిదేళ్లు నోటికి పనిచెప్పిన నేతలకి తాజాగా చుక్కలు కనిపిస్తున్నాయి.. హద్దు, అదుపు లేకుండా నోటికి ఏ మాట వస్తే అది కామెంట్ చేయడం, పైన ఉన్న అధినాయకుల మెప్పు పొందడం, పదవులు దక్కించుకోవడం లేదంటే ప్రజల సొమ్ము లూఠీ చేయడం…. ఇదీ ఏపీలో 2019 నుండి 2024 వరకు జరిగిన ప్రహసనం.. ఆ పార్టీ అధినేత జగన్‌ని ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటే టెక్నిక్.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు టీడీపీ యువనేత లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని బండ బూతులతో నిందించడం, ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్ చేయడం.. వీరిని ఎంతగా నిందిస్తే వారికి ప్రమోషన్లు, ఆర్ధిక ప్రయోజనాలు… ప్రభుత్వ పాలన కంటే ఇదే ఒక పెద్ద ప్రాజెక్ట్‌గా సాగింది జగన్ హయాంలో..
నాడు బూతులు తిట్టిన నేతలంతా నేడు చిప్పకూడు తినడానికి రెడీ అవుతున్నారు… సభ్యసమాజం చీదరించుకునేలా నోటి దురుసుతనంతో విర్రవీగిన నేతలకి నేడు బుద్ధి వస్తోంది.. బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణ మురళి, నందిగం సురేష్, వల్లభనేని వంశీ… ఇలా ఒకరి తర్వాత ఒకరు ఊచలు లెక్కలు పెడుతున్నారు.. ఈ లిస్ట్‌లో ఇంకా చాలా మంది వైసీపీ లీడర్లు ఉన్నారు.. ఆ జాబితా ఇప్పటికే రెడీగా ఉందని, నేడో రేపో ఒకరి తర్వాత మరొకరు పోలీస్ స్టేషన్ గడప తొక్కక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి..
రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు సహజం.. కానీ, తాడేపల్లి ప్యాలెస్ కేంద్ర పెద్ద పార్టీ నడిపే తీరుని, పాలిటిక్స్‌ని పూర్తిగా మార్చివేశారు.. బూతులతోనే ప్రత్యర్ధులపై విరుచుకుపడేవారు.. ప్రతిపక్ష నేతలతో ఆగితే పర్లేదు.. వారి కుటుంబాలనీ వదల్లేదు.. తిడితేనే జగన్‌కి ఇష్టం, ఆయన ప్రసన్నం కావాలంటే బూతు పడాల్సిందే.. మీడియా వాళ్లు బీప్‌లు వేసుకునే రేంజ్‌లో కొందరు బులుగు నేతలు రెచ్చిపోయారు.. తాజాగా అనుభవిస్తున్నారు..
ఏపీ సమాజం చీదరించుకునేలా, అసహ్యించుకునేలా బూతు వ్యాఖ్యలు చేసిన ఈ నేతల వెనక ఉన్నది ఎవరు.?. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా, ఒక ఫ్యాక్టరీలాగా ఒక బూతు రాజకీయ సంస్థని నడిపిన నేతలు ఎవరు.?? ఇది అంతా సజ్జల స్క్రిప్ట్..?. లేక, జగన్ డైరెక్షన్‌లోనే సాగిందా..?? జగన్ ఆదేశాలు.. సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల డైరెక్షన్… మేరకే ఇది అంతా జరిగిందా..?? 2019లో 23 స్థానాలకు పడిపోయిన టీడీపీని లేవకుండా దెబ్బకొట్టాలన్నా, ఆ పార్టీ తరఫున లీడర్లు బయటకు రాకుండా ఉండాలన్నా బూతులతోనే సాధ్యం అని ఆ పార్టీ హైకమాండ్ భావించిందా..?? లేక, ఇది అంతా సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందా..?? లేదంటే జగన్ తిట్టమంటే తిట్టేసి నేడు ఆయనకు ఆ మసి, పాపం అంటకుండా పట్టుబడిన నేతలంతా సజ్జల పేరు చెబుతున్నారా.?. వీటిలో ఏది వాస్తవం…?
ఈ బూతుల పంచాంగం వెనక ఎవరున్నా.. ఏపీ ప్రజలు మాత్రం బుద్ధి చెప్పారు.. ఇక చట్టం కూడా తన పని తాను చేసుకుపోతే, ఇకపై ఇలాంటి బూతు లీడర్లు రావాలంటే భయపడాలి.. నోటికి పని చెప్పాలంటే వణికిపోవాలి… అని కోరుకుంటున్నారు ప్రజలు. ఇంతకీ ఈ బూతు బాస్ ఎవరు..?? అనేది త్వరలో అయినా తేలుతుందా.? లేదా.?? అనేది చూడాలి..











