ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసింది కూటమి సర్కార్. గత ప్రభుత్వ పెద్దలు కుట్రపూరితంగా నిలిపివేసిన పథకాలను పునరుద్ధరించింది. వైసీపీ ప్రభుత్వం పేదల పట్ల కక్షపూరితంగా వ్యవహరించింది. ఆకలితో ఉన్న వారికి రూ.5కే ఆహారం అందించే అన్న క్యాంటీన్లను మూసివేశారంటేనే వారి మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు. బడుగు,బలహీన వర్గాలకు ఉపాధి కల్పించే కార్పొరేషన్ రుణపథకాలకు బ్రేకులేశారు వైసీపీ పెద్దలు. మత్య్సకారులకు వలలు, పడవలు కూడా ఇవ్వలేదు. ఒక్కటేమిటి. జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసంతో సంక్షేమాన్ని అటకెక్కించారు. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా గాడిన పెట్టే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్ నిధులతో పనిలేకుండానే అమరావతిని ఎలా పట్టాలెక్కించవచ్చో కేంద్ర సహకారంతో చేసి చూపించింది. రూ.9 వేల 371 కోట్లు చెల్లించి..వైసీపీ సర్కార్ నిలిపేసిన 95 పథకాల్లో 74 పథకాలను పునరుద్ధరించింది. 205 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం నిధులు కేటాయించింది.
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు
వెనుకబడిన తరగతుల వారికి మేలు చేసే లక్ష్యంతో టీడీపీ హయాంలో ప్రారంభించిన ఆదరణ స్కీం కింద లక్షల మందికి పనిముట్లు, ఇతర పరికరాలు అందించారు. ఐతే ఈ పథకాన్ని గత వైసీపీ సర్కార్ అటకెక్కించింది. కూటమి ప్రభుత్వం మళ్లీ ఆ పథకాన్ని పునరుద్ధరిస్తోంది. ఇందుకోసం రూ.1000 కోట్లు కేటాయించింది. ఈ స్కీం కింద దాదాపు రూ. లక్షా 50 వేల మందికి వివిధ ఉపకరణాలు ఇవ్వనున్నారు. స్వయం ఉపాధి రాయితీ రుణాల పథకం పునరుద్ధరించనుండటంతో 49 వేల మంది మైనారిటీలు, 30 వేల మంది బీసీలు, 23 వేల మంది ఎస్సీలు, 20 వేల మంది ఎస్టీలకు లబ్ధి చేకూరనుంది. బీసీ స్టడీ సర్కిల్‌కు రూ.10 కోట్లు కేటాయించారు. ఇందులో 5 వేల 720 మందికి శిక్షణ అందించనున్నారు. ఇక 10 లక్షల 28 వేల మందికి ప్రీ, పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్ కోసం రూ.2 వేల 137 కోట్లు చెల్లించనున్నారు.
సంవత్సరంలోనే 50 వేల గోకులాలు
టీడీపీ హయాంలో 2015-1 మధ్య 60 వేల గోకులాలకు అనుమతులిచ్చారు. వాటిలో 30 వేలకు పైగా నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక బిల్లు నిలిపేసి..ఆ పథకాన్ని నాశనం చేశారు. ఐతే కూటమి ప్రుత్వం వచ్చాక ఉపాధి నిధుల అనుసంధానంతో గతేడాదే గోకులాలను పునరుద్ధరించారు. గడిచిన 8 నెలల్లోనే 13 వేల 376 గోకులాలు పూర్తి చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 50 వేలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పోలీసులకు బీమా –
2019కి ముందు పోలీసులకు వ్యక్తిగత యాక్సిడెంట్ బీమా ఉండేది. ఐతే జగన్ సర్కార్ ఈ స్కీమ్‌ను ఎత్తేసింది. ఇప్పుడు కూటమి సర్కర్ ఈ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించడంతో దాదాపు 60 వేల మంది పోలీసు సిబ్బందికి మేలు జరగనుంది. పోలీసు దళం ఆధునికీకరణపథకానికి వైసీపీ హయాంలో రాష్ట్ర వాటా నిధులు జత చేయకుండా నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం రూ. 250 కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లించింది. మళ్లీ రూ.61 కోట్లు కేటాయించింది.
రైతులకు రుణాలు, భూసార కార్డులు
వైసీపీ పాలనలో పీఎం కుసుమ్ కింద వ్యవసాయ మోటార్లకు సౌరవిద్యుత్ పథకం మాకొద్దంటూ కేంద్రానికి లేఖ రాసింది. దీంతో రైతులకు నష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు అమలుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరడంతో 3 లక్షల కనెక్షన్లకు పర్మిషన్ వచ్చింది.
– 1,875 డ్రోన్ల పంపిణీ (2024-25, 2025-26),2లక్షల మందికి పైగా వ్యక్తిగత యంత్రపరికరాలు
– రూ.500 కోట్లతో ఏడాదికి 7.5 లక్షల ఎకరాల్లో సూక్ష్మ, తుంపర సేద్యం
– మళ్లీ భూసార పరీక్షలు.. 6 లక్షల మందికి కార్డులు.. కొత్తగా ఉపగ్రహ ఆధారిత పరీక్షలు
– 5.21 లక్షల ఎకరాలకు రాయితీపై సూక్ష్మపోషకాలు
– 18 లక్షల మందికి లబ్ధి కల్పించేలా రూ.3 లక్షల వరకు రుణాలకు పావలా వడ్డీ, రూ.లక్ష రుణాలకు సున్నా వడ్డీ
– పట్టు రైతులకు రాయితీపై డిస్‌ఇన్‌ఫెక్టెంట్స్, రీలింగ్ పరికరాలు, నేత్రికలు, ఇతర పథకాల పునరుద్ధరణ. మల్బరీ తోటలకు డ్రిప్ సౌకర్యం
ఇక వైసీపీ పాలనలో జవసత్వాలు కోల్పోయిన కార్పొరేషన్లను మళ్లీ బలోపేతం చేయాలని నిర్ణయించింది కూటమి సర్కార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, EWS వర్గాల్లోని యువతకు ఉపాధి కల్పించేలా ఆయా కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించింది. వ్యవసాయం, వ్యాపారం, పశుసంవర్ధకం, సేవలు.ఇలా ఏదైనా సరే, ఎంపిక చేసుకున్న రంగంలో స్వయం ఉపాధితో ముందుకు సాగేలా రుణాలు అందించి ప్రోత్సహిస్తోంది. లబ్ధిదారులపై రూపాయి భారం కూడా పడకుండానే ప్రభుత్వమిచ్చే రాయితీ, బ్యాంకు రుణం ఆధారంగా యూనిట్లు ఏర్పాటు చేయించనుంది.











