నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చండ్రపడియలోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.వెంకట నారాయణ ఫ్యాక్టరీలో రియాక్టర్‌లోకి వెళ్లే పైప్ నుంచి గ్యాస్ ఒక్కసారిగా లీకవడంతో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరికొందరు కార్మికులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సవఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గతంలోనూ ఈ ఫ్యాక్టరీలో జరగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు అంటున్నారు.అయినా యాజమాన్యం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...











