ఆదుకుంటారని ఓట్లేస్తే.. మహిళల మాన, ప్రాణాలతో ఆడుకుంటారా?
ఆదుకుని అండగా నిలబడతారని ఓట్లేసి గెలిపిస్తే.. అందినకాడికి దోచుకోవడం, అడ్డొస్తే అడ్డుతొలగించడం తెలంగాణలో రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ అప్పుల బాధలు భరించలేక.. తల్లి ఆస్తులను పంచడంలేదని అవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రచారం సాగింది. కానీ ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణా సెల్పీ వీడియో బయటకు రావడంతో బాహ్య ప్రపంచానికి అసలు విషయం వెలుగు చూసింది! టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడాడని రామకృష్ణ తెలిపాడు. నా ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని నా భార్యను హైదరాబాద్ తీసుకుని రమ్మని రాఘవ చెప్పాడు. నిన్ను అన్నివిధాల కాపాడుకుంటానని పెళ్లి నాటి ప్రమాణాన్ని మరిచి నా భార్యను ఎలా రాఘవ దగ్గరకు పంపాలి? రాఘవ డబ్బులు అడిగినా ఇచ్చేవాడిని, కానీ నా భార్యను కోరుకున్నాడు. అది ఎలా ఇవ్వగలను? నేను ఒక్కడినే చనిపోదామకుకున్నాను.. కానీ ఆ తరువాత నా భార్య, పిల్లలకు ఇబ్బందులు తప్పవని నాతోనే వాళ్లని కూడా తీసుకుని వెళ్లిపోతున్నాను. నీ భార్యను నా దగ్గరకు పంపు.. లేకపోతే నీ సమస్య పరిష్కారం కాదు.. నీ ఆస్తి నీకు రాదు.. నిన్ను ఎవరూ కాపాడలేరు అని రాఘవ బెదిరించాడు. అందుకే ఈ ఆత్మహత్య కు నిర్ణయం తీసుకున్నాను .. అని సెల్పీ వీడియో తీసుకుని కుటుంబ మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డాడు నాగ రామకృష్ణ! భార్య శ్రీ లక్ష్మి, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్య పై పెట్రోల్ పోసి తానూ నిప్పంచుకున్నాడు. ఈ ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా.. 80 శాతం గాయాలతో తీవ్రంగా గాయపడిన సాహితి ఆసుపత్రిలో కొన ఊపిరితో పోరాడి కన్నుమూసింది!
అత్యంత దారుణ ఘటన.. పెయిన్ ఫుల్ డెత్ కు కారకుడు రాఘవ పరారు..!
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనముడు వనమా రాఘవ కామ వాంఛకు కుటుంబం మొత్తం బలైంది. ఆత్మాభిమానంతో రామకృష్ణ.. తనతోపాటు కుటుంబం మొత్తాన్ని తీసుకుపోయాడు. ఎంత పెయిన్ ఫుల్ డెత్ అంటే.. నాలుగు నిండు ప్రాణాలు వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని.. ఆ మంటల్లో ఆర్తనాధాలు చేశారు. నీచుడైన ఎమ్మెల్యే కుమారుడి కామవాంఛకు కుటుంబ మొత్తం ఇలా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను విడిచారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవ పాల్వంచలోని తన ఇంటి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. మృతుడు రామకృష్ణ సుసైడ్ నోట్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాఘవ కోసం గాలిస్తున్నట్లు ఎఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా కొడుకు అరెస్ట్ కాకుండా పై స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం











