ఢిల్లీ పీఠం కదిలే సమాధానం.. ఇది కాదా పరాభవమంటే..!
దేశ చరిత్రలో మోదీ అధ్యాయాన్ని ఘనంగానే అభివర్ణిస్తారు చరిత్రకారులు..! ఎందుకంటే బీజేపీని ఒంటిచెత్తో రెండుమార్లు ఢిల్లీ పీఠంపై కూర్చోపెట్టిన ఘనత ఆ పార్టీలో మోదీకే దక్కుతోంది!! అయితే మోదీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. అందులో ఒకటి సాగు చట్టాలని చెప్పవచ్చు! ఆ సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతుల ఢిల్లీలో 15 నెలలు చేసిన ఉద్యామాన్ని జీవితంలో మరవరు. అధికారం చేతిలో ఉంది కదా.. అని అడ్డగోలు నిర్ణయాలతో చట్టాలు చేయాలని చూస్తే.. ఏ నేతకైనా ఇలాంటి పరాభావాలు తప్పవు అన్నట్లు పంజాబ్ లో ఈ రోజు మోదీకి చవిచూపించారు. రానున్న రెండు నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఉన్న నేపధ్యంలో మోదీ అండ్ టీం.. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలపై గట్టి పోకస్ పెట్టాయి! ఈ నేపధ్యంలో మోదీ ఉత్తరప్రదేశ్ లో తిష్టవేసి వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ప్రధాని పంజాబ్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ప్రధాని పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే మోదీ వర్షం కారణంగా రోడ్డు మార్గంలో బఠింటా నుంచి ఫిరోజ్ పూర్ కు బయలు దేరారు. మార్గ మధ్యంలో జాతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్ ను రైతులు దిగ్బంధించారు. దీంతో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. అంతేక భద్రత వైఫల్యం కారణంగా అదే రహదారిపై ప్రైవేటు వాహనాలు కూడా ఫ్లైవర్ పైకి వచ్చి చేరడంతో మోదీ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. చేసేదేమి లేక తిరిగి బఠింటా విమానాశ్రయానికి మోదీ చేరుకుని ఢిల్లీ తిరుగు ప్రయాణమయ్యారు.
విమానాశ్రయం చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్న మోదీ..!
ఫిరోజ్ పూర్ పర్యటించాల్సిన మోదీకి రైతుల నుంచి వచ్చిన ఊహించని నిరసన కారణంగా వెనుదిగారు. రూ.42,750 కోట్లతో అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. అనంతరం భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో రైతులు నిరసనలు, తలెత్తిన భద్రత వైఫల్యాలు వెరసి టోటల్ షెడ్యూల్ రద్దైంది. ఈ పరిణామ క్రమంలో ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విట్ చేసింది. ప్రాణాలతో బఠిండా విమానాశ్రయానికి చేరుకున్నా.. మీ ముఖ్యమంత్రికి థాంక్స్ అని మోదీ పంజాబ్ అధికారులతో చెప్పినట్లు ఆ ట్విట్ సారాంశం! ఈ నేపధ్యలో భద్రత వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ కాన్వాయి సమీపానికి ఇతర వాహనాల రాకపోకలు లేకుండా చూడటంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోం శాఖ తప్పుపట్టింది. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను పంజాబ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. బీజేపీ నేతలు జనాలను సభకు రప్పించడంలో విఫలం కావడంతో ర్యాలీ ఫ్లాప్ అయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో మోదీపై, బీజేపీ పంజాబ్ నేతలపై విమర్శలను ఎక్కుపెట్టారు నెటిజన్లు!











