కరోనా శాపం కాదు వర్మకు వరం. ఈ విషయం మరోసారి రుజువైంది. కరోనా సాకుతో ఆయన కోర్టుకు రాలేదు. తనకు కరోనా రాలేదని వర్మ అంటున్నా కోర్టు మాత్రం ఆయనను కనికరించింది. ఇది జరిగింది మర్డర్ సినిమా విషయంలో. ఆ వివరాలేమిటో చూద్దాం. ప్రణయ్, అమృతల కథతో ఆయన ‘మర్డర్’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. నల్గొండ కోర్టులో మంగళవారం విచారణకు వర్మ హాజరుకావలసి ఉన్నా ఆయన రాలేదు. తన క్లయింట్ వర్మకు కరోనా సోకినందున అఫిడవిట్ పై సంతకం చేయలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణను వాయిదా వేయాలని ఆయన కోర్టును కోరారు. దాంతో విచారణనను ఈ నెల 14కు కోర్టు వాయిదా వేసింది. దీనిపై అమృత స్పందిస్తూ రాంగోపాల్ వర్మ కు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. తనకు కరోనా సోకలేదని వర్మ ట్వట్టర్ లో పేర్కొనడాన్ని ఆమె ప్రస్తావించారు. తర్వాతి వాయిదాలో దీనిపై వివరిస్తానని వర్మ న్యాయవాది అన్నారు. ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు కూడా విడుదలయ్యాయి. ధియేటర్లు తెరిచాక సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కోర్టు విషయాలు వర్మకు కూడా తెలుస్తాయి కాబట్టి దీనిపై ఆయన మరేం ట్వట్ చేస్తారో చూడాలి.
పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?
అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మవవీగా రికార్డు సృష్టించిన...