గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్‌తో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి బదిలీపై వెళ్లడంతో కొత్త సీజే రానున్నారు. ఆయన ప్రమాణ స్వీకారంపై గవర్నర్‌తో ఏపీ సీఎం 40 నిమిషాలుపైగా చర్చించినట్టు తెలుస్తోంది. అంతేగాక ఏపీలో దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఏపీ సీఎం గవర్నర్‌కు దేవాలయాల ధ్వంసంపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నివేదిక కోరిన కేంద్రం
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై కేంద్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం కోరినట్టు తెలుస్తోంది. దీనిపై వివరణ కోరేందుకు ఏపీ సీఎంను గవర్నర్ పిలిపించుకున్నారని సమాచారం. దేవాలయాలపై దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రతిపక్షాలు దేవాలయాలపై దాడులు చేయించి, రాజకీయం చేస్తున్నారని సీఎం గవర్నర్‌కు వివరించినట్టు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ కార్యాలయం అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.
Also Read: రగిలిపోతున్న రాజులు.. వెల్లంపల్లి పోస్టుకు ఎసరేనా?