టాలీవుడ్ లో మరో సంచలన బయోపిక్ తెరకెక్కబోతోంది. ఒకవిధంగా అది పొలిటికల్ మల్టీస్టారర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులోని ప్రధాన పాత్రలు రాజకీయంగా దిగ్గజాలు. వీరిలో ఒకరు నారా చంద్రబాబు నాయుడు అయితే, ఇంకొకరు వైస్.ఎస్. రాజశేఖరరెడ్డి. ఇందులో కొత్తేముంది వీరిద్దరిపై ఆల్రెడీ సినిమాలు వచ్చేశాయి కదా అనుకుంటున్నారా… ఆ సినిమాలు వేరు… ఇది వేరు. వెబ్ మూవీగా ఇది రూపొందుతోంది. వీరిద్దరి గురించి చాలా మందికి తెలియని అంశాలు ఎన్నో ఉన్నాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు. కాంగ్రెస్ పార్టీలో కలిసి రాజకీయా ప్రయాణం సాగించారు. కలిసి వ్యాపారాలు కూడా చేశారని చెబుతారు. ముఖ్యంగా వీరిద్దరూ మంచి స్నేహితులు. ఈ స్నేహబంధం కథా వస్తువుగా సినిమాను తెరకెక్కంచే ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. కొత్త తరం వారికి ఈ విషయాలు తెలియదు. వీరి స్నేహం ఎంత కాలం సాగింది? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే ఆసక్తికర సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయట. తన మామగారు తెలుగు దేశం పార్టీ పెట్టడంతో చంద్రబాబునాయుడు కాంగె్స్ పార్టీని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ను ఎవరు తెరకెక్కించబోతున్నారు? ఇందులో చంద్రబాబు నాయుడిగా ఎవరు నటించబోతున్నారు? రాజశేఖరరరెడ్డి పాత్రను ఎవరు పోషిస్తారు? అనేవి ఆసక్తికర విషయాలు. విష్ణు ఇందూరి దీనికి నిర్మాత. ఈయన ఇంతకుముందు తెలుగునాట ఒక చరిత్ర సృష్టించిన రాజకీయ దిగ్గజాల వెబ్ సిరీస్ పొలిటికల్ బయోపిక్స్ లలో మల్టీస్టారర్ గానే చెప్పాల్సి ఉంటుంది. చదరంగం వెబ్ సిరీస్ చేసిన రాజ్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించారు. తిరుమల రెడ్డి దీనికి సహకారం అందించనున్నారు. అయితే ఈ కథ తనదేనంటున్నారు ప్రస్థానం దర్శకుడు దేవా కట్టా. 2017లో చంద్రబాబు నాయుడు – వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ జీవితాలను ఆధారంగా చేసుకుని వారి మధ్య స్నేహం రాజకీయ వైరం అనే అంశాలతో ఫిక్షనల్ గా ఓ కథను రెడీ చేశాను. 2017లో ఈ కథను బేస్ చేసుకుని పలు వెర్షన్ ను కూడా రెడీ చేసి కాపీ రైట్ చట్టం కింద రిజిష్టర్ చేయిస్తూ వస్తున్నాను. అయితే కొందరు నా ఆలోచనను హైజాక్ చేస్తున్నారు. వాళ్ళు నేను రిజిస్టర్ చేయించిన సీన్స్/థీమ్స్ ను కాపీ చేసి నన్ను లీగల్ గా ప్రొసీడ్ అయ్యేలా చేయరనే అనుకుంటున్నాను.‘‘నేను ఈ స్క్రిప్ట్ ను మూడు భాగాలుగా చేశాను. హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాసుకున్నాను. తర్వాత దీన్ని వెబ్ సిరీస్గా మార్చుకున్నాను. మా టీమ్ కొన్ని మేజర్ ఓటీటీలను కలిసి ఈ ఐడియా చెప్పారు. మా లీగల్ టీమ్ ఈ వ్యవహరాన్ని గమనిస్తున్నారు” అని దేవాకట్టా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ వివాదం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...











