ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. మాజీ APSBCL ఎండీ వాసుదేవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ వెంకట సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరు కోర్టులో పిటిషన్ వేశారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఏపీ లిక్కర్ స్కామ్‌లో వాసుదేవ రెడ్డి A-2 కాగా, వెంకట సత్యప్రసాద్ A-3గా ఉన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్ ద్వారా వేల కోట్ల రూపాయలు వెనకేసుకోవాలని చూసిన జగన్ రెడ్డి అండ్ టీం అందుకు తగ్గట్లుగా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా రైల్వే ట్రాఫిక్‌లో పని చేసే తెలంగాణకు చెందిన వాసుదేవ రెడ్డిని, IASకు ప్రమోట్ చేస్తామని సత్యప్రసాద్‌ను ఊరించి స్కామ్‌కు తెరలేపారు. ఈ ఇద్దరు అధికారులు ఈ స్కామ్‌లో నామమాత్రమే ఐనప్పటికీ..దందా మొత్తం ఈ ఇద్దరి పేరిటే కొనసాగించారు.
2019 సెప్టెంబర్‌లో APSBCL ఎండీగా నియమితులయ్యారు వాసుదేవరెడ్డి. తర్వాత డిస్టిలరీగా కమిషనర్‌గా మారారు. అప్పటి సీఎం జగన్ ఆమోదంతోనే ఈ నియామకాలు జరిగాయి. లిక్కర్ ఆర్డర్ వ్యవస్థను మాన్యువల్‌కు మార్చి, సిండికేట్‌గా ప్లాన్ అమలు చేశారు. ఇక, సత్యప్రసాద్ రెవెన్యూ ఎక్సైజ్ శాఖలో ఉండేవారు. మిథున్ రెడ్డి..ఇచ్చిన IAS ప్రమోషన్ ఆఫర్‌తో డిపోల సరఫరాలు, గవర్నమెంట్ రిటైల్ అవుట్‌లెట్‌లలో అమ్మకాలను నియంత్రించి, కిక్‌బ్యాక్ ఆధారంగా ఇండెంట్ ప్లాన్‌లు తయారు చేశారు సత్యప్రసాద్. వాట్సాప్ గ్రూప్‌లు, పర్సనల్ ల్యాప్‌టాప్‌ల ద్వారా డిపో మేనేజర్లతో సమన్వయం చేశారు.
ACB కోర్టులో ఈ ఇద్దరూ అప్రూవర్ పిటిషన్‌లు దాఖలు చేశారు. సిట్‌కు పూర్తిగా సహకరిస్తున్నామని, మద్యం కుంభకోణం అన్ని వివరాలు అందించామన్నారు. ఐతే ఆగస్టులో వీరి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. లిక్కర్ స్కామ్‌లో ఈ ఇద్దరికి కీ రోల్ అని పేర్కొన్నారు న్యాయమూర్తి. ఇప్పుడు మరోసారి అప్రూవర్ అయ్యామని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరు అన్ని వివరాలు చెప్పి సహకరిస్తూండటంతో లిక్కర్ స్కామ్‌లో అరెస్టులు చూపించలేదు











