హెడ్డింగ్ ను చూసి ఇదేదో సినిమాలో మాళవిక చేస్తోన్న పాత్ర అని భ్రమ పడకండి. నిజంగానే ఆమె అడ్వకేట్ కోర్స్ పూర్తి చేసి సర్టిఫికెట్ ను కూడా పొందింది. మోడలింగ్ రంగాన్ని వృత్తిగా ఎన్నుకొన్నప్పటికీ.. తాను చదువుకున్న చదువుకు పరిపూర్ణతను, పరమార్ధతను సాధించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ముంబై లో పుట్టిన మాళవికా శర్మ.. అక్కడే స్కూలింగ్ , కాలేజ్ చదువులు పూర్తి చేసి.. ఆపై లా కోర్స్ ను కూడా అక్కడే ఉన్న రాజ్వీ లా కాలేజ్ లో కంప్లీట్ చేసింది. ఆ పై మోడలింగ్ రంగంలో రాణించి.. రవితేజ ‘నేలటిక్కెట్టు’ సినిమాతో కథానాయికగా తన కెరీర్ ను ప్రారంభించింది.

పట్టుదలతో ఎల్ ఎల్బీ పూర్తి చేసిన మాళవికా శర్మ.. మహారాష్ట్ర, గోవాలోని బార్ కౌన్సిల్ లో మెంబర్ షిప్ ను కూడా సాధించింది. ఈ విషయాన్ని మాళవిక శర్మ తన ఇన్టా గ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది. బాంబే హై కోర్ట్ కు సంబంధించిన అడ్వకేట్ ఐడెంటిటీ కార్డ్ ను తన లా సర్టిఫికెట్ తో సహా జత చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం రామ్ పోతినేని రెడ్ మూవీలో ఒక కథానాయికగా నటిస్తోన్న మాళవికా శర్మ.. ఫ్యూచర్ లో ఎప్పటికైనా క్రిమినల్ లాయర్ గా పేరు తెచ్చుకోవాలనుకుంటోందట.
Must Read ;- ఇన్ స్టా లో ‘అనన్య’ సామాన్యమైన అందాలు.. !











