కరోన కట్టడిలో సర్కార్ అలసత్వాన్ని ఏకంగా హై కోర్టు మందలించిన మార్పు రాలేదని కేసీఆర్ పై విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు… తాను అనుకున్నది నెరవేర్చుకోవడానికి కేసీఆర్ గారు విజిలెన్స్, ఏసీబీ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు సహా సమస్త అధికార గణాన్నీ ఉరుకులు పెట్టించి దర్యాప్తు చేయించి నివేదికలు రప్పించారు. అవినీతిని సహించేది లేదన్నట్టుగా చూపిన అదే శ్రద్ధ, ఆ పట్టుదల కోవిడ్ కట్టడి విషయంలో ఎందుకు లేదు? విజయశాంతి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. హైకోర్టు ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా దున్నపోతు మీద వర్షం పడిన చందంగా ఉందే తప్ప ఏ మాత్రం పట్టింపులేదని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని విజయశాంతి అన్నారు.
రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు… తాను అనుకున్నది నెరవేర్చుకోవడానికి కేసీఆర్ గారు విజిలెన్స్, ఏసీబీ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు సహా సమస్త అధికార గణాన్నీ ఉరుకులు పెట్టించి దర్యాప్తు చేయించి నివేదికలు రప్పించారు.
— VijayashanthiOfficial (@vijayashanthi_m) May 4, 2021