ఫైనల్ ఎస్ఎస్ఆర్ ప్రకారం డ్రాఫ్ట్ ఎలక్టోరల్స్ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. నవంబరు 16వ తేదీ నాటికి 4 కోట్ల 01 లక్ష 45 వేల 674 మంది ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు. వీరిలో
పురుషులు: 1,98,56,355.
మహిళలు: 2,02,85,236.
థర్డ్ జండర్: 4,083.
ఓటర్లు ఉన్నట్టు ప్రకటించారు.
2021 జనవరి 15 నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అందుకు సంసిద్ధతగా ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈసీ, ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సవరణలు పంపించాల్సిందిగా కోరారు. రాష్ట్రంలోని ఓటర్లు తమ తమ అభ్యంతరాలను వినతులను పంపడానికి డిసెంబర్ 15 తేదీ వరకు గడువు ఉంటుంది. 2021 జనవరి 15 తేదీన ఓటర్ల తుది జాబితా సిద్ధం అవుతుందని వెల్లడించిన ఈసీ. 2020 నవంబర్ 16 తేదీ నాటికి సాధారణ, సర్వీసు, ఎన్నారై ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.
Also Read ;- నిమ్మగడ్డతో పెట్టుకుంటే అంతే.. సర్కారుకు సరికొత్త బ్రేక్