తమ్ముడు పవన్ ‘నాక్కొంచెం తిక్కుంది… దానికో లెక్కుంది’ అని ఓ సినిమాలో డైలాగ్ పలికిన సంగతి తెలిసిందే. అదే బాటలోనే తన మాటలు కూడా వదిలారు అన్నయ్య నాగబాబు. తనకో కుక్కుంది దానికో లెక్కుంది అంటున్నారీ మెగా బ్రదర్. ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంగతి తెలిసిందే. ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన తన వ్యూస్ ను అభిమానులకు షేర్ చేస్తుంటారు. సినిమాలు, రాజకీయాలనే గాక ప్రతి విషయంపై తన అభిప్రాయాలను ఈ ఛానల్ ద్వారా తెలియచేస్తుంటారు. తాజాగా తన ఇంట్లో జరిగిన ఓ సన్నివేశాన్ని ‘విశ్వాసం లేని కుక్క’ అంటూ వీడియో రూపంలో ప్రేక్షకులతో పంచుకున్నారు. 2006 నుంచి తాను పీకూ అనే కుక్కను పెంచుకుంటున్నానని అది ఇన్ని రోజులు తనపైకి ఎవరైనా వస్తే వారి మీద దాడి చేస్తాన్నట్లుగా కలరింగ్ ఇచ్చిందని అన్నారు. తన భార్యకు పాములంటే భయమని ఆ భయాన్ని పొగొట్టేందుకు ఓ రబ్బర్ పామును తెచ్చిన వేళ పీకూ అసలు రంగు బయట పడిందని నాగబాబు చెప్పుకొచ్చారు. రబ్బర్ పాముకు భయపడి తన బార్య పద్మతో బాటు ఆ కుక్క కూడా లోపలికి పారిపోయిందని నాగబాబు పగలబడి నవ్వారు. శునకాలు విశ్వాసాన్ని చూపిస్తాయన్న నమ్మకం తనకు పోయిందని నాగబాబు తెలిపారు. కుక్కల గురించి ఎన్నో సాహసగాధలు వినే ఉంటాము. మా పీకూ కూడా అలాంటి కోవకు చెందినదే అని ఇన్నాళ్లు అనుకున్నా. కానీ ఈ సంఘటనతో నా అభిప్రాయాన్ని మార్చుకున్నానని నాగబాబు ఆ వీడియోలో పేర్కొన్నారు.
జగన్‌కి ప్రభాస్ ఫ్యామిలీ షాక్..?? తాడేపల్లి ప్యాలెస్‌కి మెస్సేజ్..!!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ వైసీపీ అధినేత జగన్‌కి ఝలక్...