సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బ్యాంకు ఆఫీసర్ గా నటించనున్నాడని సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 9న టైటిల్ సాంగ్ విడుదల చేయనున్నట్లు థమన్ ట్వీట్ చేశారు. థమన్ చేసిన ట్వీట్ తో మహేష్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించనున్నాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కరోనా కారణంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కానీ సంగతి తెలిసిందే. నవంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
అయితే మహేష్ బాబు ఆగష్టు 9న 45 వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. మహేష్ అభిమానులు ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన తన అభిమానులకు కీలక సూచనలు చేశారు. ” ప్రియమైన అభిమానులకు.. మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్టం. నా పుట్టినరోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తోన్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తోన్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టినరోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ మహేశ్ బాబు” అంటూ ట్వీట్ చేశారు.
భగీరధకు ఎన్ టి ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన "మహానటుడు ,ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ "...