ఏపీ సీఎం జగన్ కుట్ర పూరిత రాకీయాలతో రగిపోతూ టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లోపెట్టించడంతో ఏపీలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. నెల రోజులకుపైగా జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును చివరి సారిగా కలిసిన నారా లోకేశ్ బాబు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఎండలకు డీహైడ్రేషన్‌కు గురైన చంద్రబాబు.. ఆ తర్వాత స్కిన్ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారు. అయితే.. డెర్మటాలజీకి చెందిన వైద్య బృందం ఆయనను పరీక్షించి.. అందుకు సంబంధించిన మెడిసిన్ ఇచ్చారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టు ఆదేశాలతో జైలు గదిలో చంద్రబాబుకు ఏసీ సదుపాయం సమకూరింది.
ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జైల్లో చంద్రబాబు అనారోగ్యంతో ఉన్నారన్న వార్త చివరి సారిగా లోకేశ్ చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాతే తెలిసింది. అప్పటికే ఆయన చర్మసంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని సైతం జైలు అధికారులు పట్టించుకోలేదు. తనపాలనలో ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన జైల్లో అనారోగ్యంతో ఉన్నారంటూ న్యాయవాదులు పిటిషన్ వేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. బాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఆయన బరువు కూడా తగ్గారంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతుండటంతో.. ఈరోజు మళ్లీ బాబు వ్యక్తిగత వైద్యుల సమక్షంలో ప్రభుత్వ వైద్యులు ఓ కీలక నివేదికను విడుదల చేశారు. అత్యవసరంగా కోర్టు ఆదేశాలతో ఓ వైద్య బృందం ఆయన్నుపరిశీలించింది.ఈ బృందంమే ఇప్పుడు చంద్రబాబు కు వైద్యం అందించడంలో కీలకమైంది. ఆయన్నుపరిశీలించి వచ్చాక తగిన వైద్యం ఇవ్వడంతో పాటు ఆయనకు జైల్లో చల్లనివాతావరణం కల్పించాలనికూడా నివేదిక ఇచ్చింది.
అసలు లోకేశ్‌కు చంద్రబాబు అనారోగ్యం గురించి లీక్ చేసిందెవరన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎక్కడ తమ గురించి తెలిస్తే ప్రభుత్వం తమపై కక్ష కడుతుందోనని వారంతా లోకేశ్‌ను తమ గురించి ఎవరికీ చెప్పొద్దని కోరారట. అందుకు హామీ ఇచ్చిన లోకేశ్ చంద్రబాబును జాగ్రత్తగాచూసుకోవాలని కోరారట.