టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. దీని తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకున్న విజయ్.. మరో వైపు నిర్మాతగా కూడా దూసుకెళుతున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ అనే బ్యానర్ పై విజయ్ .. తొలి ప్రయత్నంగా ‘మీకు మాత్రమే చెప్తా’ అనే మూవీ నిర్మించిన సంగతి తెలిసిందే. దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది.
అయినప్పటికీ.. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా.. ‘పుష్పకవిమానం’ అనే మూవీ నిర్మిస్తున్నాడు విజయ్. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో ఉంది. త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విజయ్ దేవరకొండ తన సొంత నిర్మాణంలో ముచ్చటగా మూడో సినిమాను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడని టాక్.
పృధ్విసేనా రెడ్డి అనే కొత్త దర్శకుడ్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. విజయ్ ఓ న్యూజెన్ స్టోరీతో ఈ సినిమాను నిర్మించబోతున్నాడట. ఈ మూవీతో పలువురు నూతన నటీనటుల్ని పరిచయం చేస్తారట. కరోనా పరిస్థితులు చక్కబడ్డాకా ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో చూడాలి.
Must Read ;- సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ అయిన ‘లైగర్’ టీజర్