ఒక్కోసారి కామెడీ కూడా ట్రాజెడీకి దారి తీస్తుంది. సిల్లీగా చేసిన పనులు సీరియస్ అవుతాయి. తిరుమల ప్రసాదం విషయంలో యాంకర్ శివజ్యోతి.. కామెడీ కోసం కామెంట్స్ చేసినా.. మ్యాటర్ సీరియస్ అయింది. ఆమె ఎప్పుడో చేసిన రీల్‌ని ఎవరో పనిగట్టుకొని వైరల్ చేశారు. ఆ వీడియో చూసిన భక్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. రెండురోజులు ఆన్‌లైన్ మొత్తం శివజ్యోతి ఇష్యూతో మారుమోగిపోయింది. భక్తులు మనోభావాలు దెబ్బతిని బాధపడతుంటే.. కొంత మంది ఫేక్ వార్తలతో.. అగ్నికి మరింత ఆజ్యం పోసే ప్రయత్నాలు చేశారు..
శివజ్యోతిని టీటీడీ బ్యాన్ చేసిందని.. ఆమె ఆధార్ కార్డుని దేవస్థానం అధికారులు బ్లాక్ చేశారనే వార్తలు వచ్చాయి. అయితే శివజ్యోతిని బ్యాన్ చేశారంటూ వచ్చిన వార్తల ఆరిజిన్ చూస్తే.. అవన్నీ వైసీపీని సపోర్ట్ చేసే సోషల్ మీడియా గ్రూపులు, ఛానల్స్ నుంచే ప్రారంభమైనట్లు నెట్‌లో చర్చ జరుగుతోంది. అంటే శివజ్యోతి ఇష్యూని హైజాక్ చేయడానికి బ్లూ మీడియా ట్రై చేసిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. స్వామి వారి లడ్డూల తయారీకి నకిలీ నెయ్యి వాడిన అంశంపై.. సీబీఐ సిట్ కీలక అంశాలను బయటపెట్టింది. శ్రీవారి భక్తుల ఆగ్రహాన్ని వైసీపీ నుంచి శివజ్యోతి మీదకు డైవర్ట్ చేయడానికే ఇలాంటి ఫేక్ న్యూస్ పుట్టించి ఉండవచ్చని మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు. శివజ్యోతి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అమెను కొండకు రాకుండా బ్యాన్ చేశారనే వార్తలు రావడంతో.. ఈ వ్యవహారం వెనుక బలమైన వ్యక్తులు, వ్యవస్థలు ఉండొచ్చనే డౌట్లు వినిపిస్తున్నాయి..
ఏది ఏమైనా.. ఫేక్ న్యూస్‌ని నమ్మొద్దని టీటీడీ అధికారులు కోరుతున్నారు. అఫిషియల్ సోర్సుల నుంచి వచ్చిన వార్తలనే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటి వరకు భక్తులపై నిషేధం విధించలేదని.. ఇకపైనా ఎవరినీ నిషేధించబోమని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. అధికారికంగా టీటీడీ నుంచి క్లారిటీ రావడంతో.. శివజ్యోతిని బ్యాన్ చేశారంటూ జరిగిన ప్రచారం ఫేక్ అని తేలిపోయింది..











