గుంటూరు జిల్లా, ప్రతిపాడులో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందా?
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం..! హోం మంత్రి మేకతోటి సుచరిత నియోజకవర్గంమిది!! ఇక్కడ గతంలో వినాయకుని నిమర్జనం సమయంలో తలత్తెన వివాదం కారణంగా ఎందరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. అది మరవక మునిపే.. పత్తిపాడు మండలం పరిధిలోని బోయపాలెం జాతీయ రహదారిపై టీడీపీ కార్యకర్త వెంకట నారాయణపై పెట్రోల్ పోసి వైసీపీ కార్యకర్తలు నిప్పంటించారు. మద్యం ధరలు విపరీతంగా పెరిగాయని, అందుకు కారణం జగన్ రెడ్డేనని విమర్శించడం.. చంద్రబాబు ఉన్నప్పుడు మద్యం ధరలు ఇంత విచ్చలవిడితనం లేదని వెంకట నారాయణ అనే టీడీపీ కార్యకర్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా విమర్శిస్తున్న సమయంలో అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు చంద్రబాబు ను దూషించడం మొదలుపెట్టాయి. దీంతో అది మంచి పద్దతికాదని వెంకటనారాయణ అడ్డుకున్నాడు. మాకే ఎదురు సమాధానం చెబుతావా? అంటూ మద్యం సీసాలతో వెంకటనారాయణ తలపై కొట్టి, గాయపరిచారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ పోసి తగలపెట్టారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనను తాను రక్షించుకుని వెంకటనారాయణ స్పృహ కోల్పొయ్యాడు. స్థానికులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం వెంకటనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. పెదనందిపాడు మండలం, కొప్పర్రుకు చెందిన వెంకటనారాయణ దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త. ఈ ఘటన పై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ చర్యలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. నిన్న ఒంగోలు లో వైశ్యుడైన సొంతపార్టీ నేత సుబ్బారావు, నేడు వెంకటనారాయణ లపై ఇలా వైసీపీ రాక్షసమూకలు దాడులకు పాల్పడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.











