టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు.. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వార్త విని చలించి ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు మృతి చెందారు.. వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ఆమె ఈ యాత్ర ప్రారంభించారు.. ఈ యాత్రకి భారీ స్పందన లభిస్తోంది.. ముఖ్యంగా మహిళలకు నారా భువనేశ్వరి బాగా చేరువ అవుతున్నారు. ఇటు ఆమె చేస్తున్న సాయం, బాబుని అక్రమంగా జైలులో ఉంచినా, భువనేశ్వరి సభకు వస్తున్న ఆదరణ టీడీపీ నేతలు, కార్యకర్తలనే కాదు, వైసీపీ సోషల్ మీడియాని సైతం విస్మయ పరుస్తోంది.. ఆమెకు ఫిదా అవుతోంది వైసీపీ సోషల్ మీడియా…
భువనేశ్వరి తన నిజం గెలవాలి యాత్రలో ఎక్కడా రాజకీయ ప్రసంగాలు చేయడం లేదు.. చంద్రబాబు పోరాటం, ఆయన రాష్ట్రానికి చేసిన సేవ, ఆయన కష్టపడే తీరు, ప్రజల గురించి ఆయన ఆలోచించే విధానం, సంపద సృష్టి, ఆయన ఆరోగ్యంపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నీతి, నిజాయితీ, విలువలు గురించి ప్రసంగిస్తున్నారు.. అంతేకాదు, చంద్రబాబు తనకు నేర్పిన క్రమశిక్షణ, ఓర్పుపై కామెంట్స్ చేస్తున్నారు భువనేశ్వరి.. ఇవే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలోనై హైలైట్ అవుతున్నాయి..
అంతేకాదు, చంద్రబాబు అరెస్ట్‌తో కుటుంబ ఆత్మీయులను పోగొట్టుకున్న వారికి నారా భువనేశ్వరి మూడు లక్షల రూపాయల సాయం చేస్తున్నారు.. వారికి చెక్ అందజేస్తున్నారు.. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.. మూడు లక్షల రూపాయలంటే చిన్న విషయం కాదు.. ప్రభుత్వాలు సైతం లక్షరూపాయలతో సరిపెడుతుంటే, బాబు అరెస్ట్ వార్తతో మృతి చెందిన కుటుంబాలకు 3 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించడమపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.. ఆ కుటుంబాలకు ఇది ఊహించని ఓదార్పుగా కొనియాడుతున్నాయి వైసీపీ సోషల్ మీడియా వెబ్ సైట్లు, అకౌంట్‌లు..
ఇతర అంశాలపై ఆమె యాత్రను ట్రోల్ చేస్తున్నా, నారా భువనేశ్వరి చేస్తున్న ఆర్ధిక సాయంపై వారి నోటికి తాళం పడింది.. దీనినే ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియా హైలైట్ చేస్తోంది.. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో ప్రమోట్ చేసుకుంటోంది.. ఆ వెంటనే తాడేపల్లి ప్యాలెస్ నుండి అక్షింతలు పడడంతో ట్రోలింగ్‌కి దిగింది.. అయినా, భువనేశ్వరి బస్సు యాత్రకి భారీ రెస్పాన్స్ రావడం అనేది నిజం..