ఏపీలో జగన్ రెడ్డి పుణ్యమా అని మైనింగ్ దోపిడి మూడు పువ్వులు ఆరు కాయల మాదిరిగా విరాజిల్లుతోంది.
నెల్లూరు జిల్లాలో అధికారపార్టీ నేతలు కమిషన్ కాసుల కోసం పడుతున్న కక్కుర్తి వికృతి చేష్టాలకు దారి తీస్తున్నాయి. ఇదే అధికార పార్టీ వర్గాల్లో చిచ్చు.. విపక్షాలకు అస్త్రాలను అందజేస్తున్నాయి. సైదాపురం లో క్వార్ట్ జ్, మైకా, ఇతర విలువైన ఖనిజాలను అక్రమంగా తవ్వకాలు జరిపి.. టన్నుల కొద్దీ తోడేసి.. చెన్నైకు తరలిస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాల ఆరోపణలతో అధికారపార్టీ లో వర్గ పోరుకు తెర తీశాయి.
నెల్లూరు అక్రమ మైనింగ్ పడగ విప్పుతోంది. నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి అనుమతులు లేకుండా యధేచ్ఛగా విలువైన ఖనిజాలు తవ్వి చెన్నై పోర్టు ద్వారా చైనా, జపాన్ దేశాలకు విక్రయిస్తున్నారు. అధికారపార్టీ నేతలు.., బడా బాబులు సిండికేట్ అయ్యీ ఈ అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్లు సాక్ష్యాత్తు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఒప్పుకున్నారు. దీనిపై సీఎంవో కు కూడా సమాచారం అందించినా.. వారు స్పందించలేదని ఇంటి గుట్టును సైతం బయటపెట్టి మండి పడ్డారు అనిల్. ఇలా అనిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దూమారం రేపుతున్నాయి.
నెల్లూరు జిల్లా సైదాపురంలో వివాదస్పందంగా ఉన్న భూములు, రెవిన్యూ, ఎండోమెంట్ భూములను టార్గెట్ చేసుకుని సాగిస్తున్న అక్రమ తవ్వకాలు అధికారపార్టీలో వర్గ విభేదాలను రేపేయనే చెప్పాలి. ఇక్కడ ఉన్న భూముల్లో మైకా,పల్సపర్, క్వార్ట్ జ్, ఇతర విలువైన ఖనిజ నిక్షేపాలను అక్రమంగా తవ్వి విదేశాలకు అమ్ముకుంటున్నారు. ఇతర దేశాలకు సైతం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గడిచిన ఆరునెలలుగా దాదాపు వెయ్యి కోట్లకు పైగా క్వార్ట్ జ్ ను అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకున్నారని వార్తలు పెద్ద ఎత్తున గుప్పుమంటున్నాయి. దీనిపై నిజ నిర్ధారణ చేసేందుకు నెల్లూరు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి లు మీడియాకు పిలుపు నిచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలెర్ట్ ను ప్రకటించారు. నేతలను గృహ నిర్భందం చేశారు. దీంతో నెల్లూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అధికారం ఉంది కదా.. అని అందికాడికి దోచుకుని దాచుకునేలా అక్రమ మైనింగ్ పాల్పడుతుంటే.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వారికే వంత పాడటం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు క్వార్ట్ జ్ కు అంతర్జాతీయంగా.., ముఖ్యంగా చైనా లో ఫుల్ డిమాండ్ ఏర్పడటంతో నిషేదిత భూముల్లో కేజీఎఫ్ తరహాలో తవ్వి.. పుష్ప సినిమా మాదిగా చెన్నై పోర్టుకు తరలించి అమ్మకాలు జరుపుతున్నారు. అక్రమార్కులందరూ ఈ అక్రమ మైనింగ్ లో భాగస్వాములై.. సిండికెట్ ను సైతం మెయిన్టైన్ చేస్తున్నట్లు సమాచారం.