చంద్రబాబు అరెస్ట్‌తో పోయిన పరువు ఎలా దక్కించుకోవాలా అని తెగ టెన్షన్ పడిపోతున్నారు ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీనేతలు. దీనికి తోడు జగన్‌వరస బెట్టి మీటింగుల మీద మీటింగులు పెట్టడం, సమీక్షా సమావేశాలంటూ క్లాసులు పీకడం చాలా మంది నేతలకు నచ్చని అంశమన్నది బహిరంగ రహస్యం. అందినకాడికి దోచుకోవటం అన్న సిద్ధాంతానికి అలవాటు పడ్డ ఆ పార్టీ నేతలకు ఈ క్లాస్ పాలిటిక్స్ అసలు నచ్చటం లేదు. పైగా పీకే టీమ్ ఇస్తున్న సలహాలు పాటిస్తూ రొటీన్ కు భిన్నంగా పాలన సాగిస్తున్న జగన్ తీరు నచ్చని నేతలు వైసీపీలో చాలా మందే ఉన్నారు. అవకాశమొచ్చినప్పుడు తమ అసంతృప్తిని ఎలాగైనా బయటపెట్టాలని ఎదురు చూస్తున్నవాళ్లు క్యూలో ఉన్నారు.
తెలుగుదేశానికి మద్దతు పలికి వారాహియాత్రతో జనంలోకి జనసేన దూసుకెళుతుంటే జగన్ సమీక్ష, సమన్వయ సమావేశాలంటూ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వర్గ, గ్రూపు రాజకీయాలతో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ పార్టీ సమన్వయ కర్తల సమావేశం తర్వాత నేతలంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్త పరుస్తున్నారు.
దసరా తర్వాత ఏపీలో మూడు చోట్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలన్న సూచన వారికి నచ్చినప్పటికీ ఆ యాత్ర తర్వాత జరిగే బహిరంగ సభలకు సీఎంజగన్ హాజరు కావటం లేదన్న విషయం తెలిసి ఆగ్రహంతో ఉన్నారు. జగన్ గ్లామర్ తో కాస్తో కూస్తో జనంలో తిరుగుతున్న వైఎస్సార్ సీపీ నేతలు, చంద్రబాబు అరెస్టయ్యాక ఆయన లేకుండా బహిరంగ సభలంటే భయపడిపోతున్నారు. ధర్మాన లాంటి సీనియన్ నేతలే తెలుగుదేశం పార్టీ అభిమానులు వేసిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన సందర్భాలను తలుచుకుని అమ్మో అంటున్నారు. అసలు జగన్ లేకుండా తామెలా సభల్లో, అదీ బహిరంగ సభల్లో ఎలా పాల్గొనగలమని చర్చించుకుంటున్నారు.











