అమ్మ ఒడి.. చిన్న పిల్లలకి ఉద్దేశించిన ప్రోగ్రామ్‌లో జగన్ మాట్లాడిన మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. విజయనగరం జిల్లా కురుపాంలో జరిగిన అమ్మ ఒడి సభలో జగన్.. పవన్ పెళ్లిళ్లపై మాట్లాడడం, రాజకీయ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి.. దీంతో, ఆయనపై విమర్శలు ఎక్కువవుతున్నాయి.
సీఎం జగజగన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, అస్థిర వ్యక్తి..
అది లారీ, దాని పేరు వారాహి..
మాట్లాడితే కొడతారు, తిడతారు, బట్టలతో కొడతారు.. ఈ మాటలు, ఆ నోటికి అదుపు లేదా..? వాళ్లలా ఊగిపోతూ, నిండుగా మాట్లాడలేం , వాళ్లలాగా రౌడీల్లాగా మీసాలు తీయలేం, తొడలు కొట్టలేం, బూట్లను తిట్టలేం
,వాళ్లలా నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకోసారి భార్యలను మార్చుకోకూడదు. వివాహం అనే పవిత్ర సంస్థను రోడ్డుపైకి తీసుకెళ్లడం సాధ్యం కాదు.
వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలన్నింటికీ సీఎం జగన్ ఒక్కసారిగా సమాధానం చెప్పారు. కురుపాం అమ్మఒడి బహిరంగ సభలో జన సేనానిపై మండిపడ్డారు. గతంలో కూడా చాలా సార్లు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన జగన్ ఈసారి డోస్ పెంచారు. వారాహిలో చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఇలా చిన్నపిల్లల సమక్షంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఇలా మాట్లాడటం కర్రెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. రాజకీయాలు ఇలా చిన్న పిల్లలు, అభం శుభం వాళ్ల ముందు మాట్లాడి సమాజాన్ని ఎం చేదాంఅనుకుంటున్నారుఅన్ని కామెంట్స్ వినపడుతున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన తీరుసభ్య సభ్య సమాజం తలదించుకునేలా ఉంది అని అంటున్నారు.