పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న బ్రో టీజర్ నిన్న సాయంత్రం విడుదలవగా నేటికి ఆ టీజర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ ను కొల్లగొడుతోంది.
యూట్యూబ్ నే ఈ టీజర్ షేక్ చేసేస్తోంది. ఈ రోజు ఉదయానికి 17 మిలియన్ల వ్యూస్ ను ఈ టీజర్ కొల్లగొట్టింది. ఇది ఓ రికార్డుగానే చెప్పాలి. పవర్ స్టార్ స్టామినాను ఈ టీజర్ తెలియజెప్పింది. నిన్న సాయంత్రం 5.04 గంటలకు విడుదలవ్వాల్సిన ఈ టీజర్ కొద్దిగా ఆలస్యంగా విడుదలైంది. పవర్ స్టార్ అభిమానులకు ఫీస్ట్ గా ఈ టీజర్ ఉంది. ఈ టీజర్ కు సంబంధించిన డబ్బింగ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే చెప్పారు. ఇదే బ్రో అసలైన మాస్ ఫీస్ట్ అంటే అంటూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇది యాక్షన్ ఫాంటసీ మూవీ. తమిళంలో వినోదాయ సితం పేరుతో రూపొందిన ఈ సినిమాను తెలుగులో బ్రో గా రీమేక్ చేస్తున్నారు. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుంది.
విడుదల సమయం దగ్గర పడడంతో టీజర్‌తో ప్రమోషన్స్ నిర్మాతలు ప్రారంభించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ సంభాషణలు రాయడం విశేషం.ఇక ఈ టీజర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్‌ను ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో, ఆ రేంజ్ ఎలివేషన్స్‌తో ఉంది బ్రో టీజర్. స్టైలిష్ గాడ్‌గా పవర్ స్టార్ ఇందులో కనిపించనున్నారు. తమ్ముడు సినిమా గెటప్, పవర్ స్టార్ డైలాగ్ డెలివరీ, మామ అల్లుళ్ల కాంబో, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బ్రో ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉన్నాయి. 12 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ ను ఈ టీజర్ రాబట్టింది. అంటే 12 గంటల వ్యవధిలో కోటి మంది చూశారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో హీరోయిన్లు. హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తో ఓ ఐటమ్ సాంగ్ ఉంది. దీని కోసం పబ్ సెట్ కూడా వేశారట.
ఇక టీజర్ రివ్యూ విషయానికి వస్తే “ఏంటిది.. ఇంత చీకటిగా ఉంది.. పవర్ లేదా?” అని బ్యాక్‍గ్రౌండ్‍లో సాయి ధరమ్ తేజ్ డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. అప్పుడు మెరుపుల మధ్య పవన్ కల్యాణ్ కనిపిస్తాడు. “ఏవండీ ఎవరూ లేరా.. హలో మాస్టారూ.. హలో తమ్మడు.. బ్రో” అంటూ సాయి ధరమ్ అనడంతో పంచె కట్టుకొని మాస్ లుక్‍లో దర్శనమిస్తాడు పవర్ స్టార్.హలో మాస్టారు అంటే రాదు.. గురువుగారూ.. హలో తమ్ముడూ.. బ్రో అనగానే చాలు.. పవర్ స్టార్ అలా పవర్ ఇచ్చేస్తారు “కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం” అంటూ స్టైలిష్ గా పవన్ కల్యాణ్ డైలాగ్ ఉంది. “చిన్నపిల్లాడిని బ్రో” అంటూ సాయి ధరమ్ తేజ్ డైలాగ్ చెబుతాడు. “సినిమాలు ఎక్కువగా చూస్తావేంట్రా నువ్వు” అంటాడు పవన్ దేవుడు. ఒక నిమిషం 27 సెకన్లు ఉన్న ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. మామాఅల్లుళ్లు ఇరగదీశారు.