mmవైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి…. ప్రతి సభలోనూ విలువలు గురించి మాట్లాడతారు.. కుటుంబం, పెళ్లి, వెన్నుపోటు అంటూ ప్రత్యర్ధులపై విమర్శలు గుప్పిస్తారు.. రాజకీయ ఆరోపణలతో చెలరేగిపోతారు.. తల్లి, చెల్లిని పట్టించుకోని వారు రాజకీయాలకు అవసరమా అని నిలదీస్తారు.. ఇతర నేతలకు ఆయన పాఠాలు చెబుతారు.. అలాంటి జగన్ మోహన్ రెడ్డి తన సొంత కుటుంబ సభ్యులతో వ్యవహరిస్తున్న తీరు, ఆయన చెబుతున్న వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉంది.. రివర్స్ టెండరింగ్ అంత రివర్స్ లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..
ఇటీవల జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి ఒంగోలులో పర్యటించారు.. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు.. ఆమెని పరామర్శించడానికి విజయమ్మ ఒంగోలు వచ్చారు.. అక్కడ ఆమె, మాజీ మంత్రి, వైఎస్ కుటుంబ సభ్యులు అయిన బాలినేని ఉన్నారు. ఆయన పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు ఏకరువు పెట్టారట.. తనని పట్టించుకోవడం లేదని, తనపై కుట్రలు జరుగుతున్నాయని వాపోయారట.. ఇటీవల బాలినేని పార్టీ హై కమాండ్‌పై ధిక్కార స్వరం వినిపించారు.. తన గన్ మెన్‌లని సైతం ప్రభుత్వానికి సరెండర్ చేశారు.. ఈ అంశాలపై చర్చించడానికి సీఎంవో నుండి పిలుపు రాగా, వెళ్లి వచ్చారు.. బాలినేని వ్యవహారంపై మాట్లాడేందుకు జగన్ నిరాకరించారని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది..
తాజాగా ఒంగోలులో పర్యటించిన విజయమ్మతో తన బాధల్ని పంచుకున్నారు బాలినేని.. అయితే, విజయమ్మ సమాధానం విని ఆయన నోరెళ్లబెట్టారట. జగన్.. తనని, కూతురు షర్మిలని కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట.. షర్మిల ఆస్తుల పంపకంపై జగన్ సైలెంట్‌గా ఉన్నారని, తన కూతురు రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడిపోయిందని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారట.. తాను ఇంటికి వెళ్లినా సరిగా పట్టించుకోవడం లేదని, ముభావంగా ఉంటున్నాడని, ఇలా ఎంతకాలం సాగించుకుంటాడో చూద్దాం అని ఆమె భావోద్వేగానికి గురయినట్లు ప్రచారం జరుగుతోంది..
ఇటు బాలినేని అలకపాన్పు ఎక్కడమే కాకుండా, టీడీపీతో టచ్‌లోకి వెళ్లారని జగన్‌కి తెలిసిందని సమాచారం.. బాలినేనితోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మరికొందరు వైసీపీ నేతలు ఎన్‌టీఆర్ భవన్‌తో మంతనాలు జరుపుతున్నారని, వారంతా రేపో మాపో సైకిల్ గూటికి చేరడం ఖాయమని నిఘా వర్గాలు హెచ్చరించాయట.. దీంతో, వెంటనే అలెర్ట్ అయిన వైసీపీ హైకమాండ్.. జగన్‌తో బాలినేని అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసింది. శనివారం తాడేపల్లి వచ్చి కలవాలని పిలుపు వచ్చిందట..
ఈ భేటీని జగన్… బాలినేనిని బుజ్జగించడానికి ప్రయత్నిస్తారా..?? లేక, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల వ్యూహాలు, ఆవేశాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటారా.?. అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది..