‘నిజం గెలవాలి’ అని నారా భువనేశ్వరి చేస్తున్న యాత్రకు ప్రజలు నుంచి విశేష స్పందన వస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్ర రాజకీయ స్వరూపం పూర్తిగా మారింది. ప్రజలు స్వచ్ఛంధంగా బయటకు వచ్చి చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తుంటే.. పార్టీ శ్రేణులు కూడా వినూత్న కార్యక్రమాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తో మనోవేదనకు గురై మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను, సానుభూతిపరులను పరామర్శించేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో రాయలసీమలో యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి అనుహ్య స్పందన వస్తోంది.
రాజకీయ అనుభవం తో పనిలేదు.. ఎందుకంటే తనది రాజకీయ కుటుంబం.. బాధను వ్యక్తం చేసి.. ప్రజల గుండెలను.., మెదళ్ళను సైతం తాకేలా చెప్పే డైలాగ్స్ కు స్క్రిప్ట్ రాసుకోవాల్సిన పనిలేదు… ఎందుకంటే ఆమెది సిని నేపధ్యంలో అగ్రపథంలో ఉన్న కుటుంబం.. అన్నట్లు మూడు రోజుల నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రలో ఇవే హైలెట్స్ గా నిలిచాయి. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని భువనేశ్వరి రాజకీయ పరిణితి సాధించిన వ్యక్తిలా పిన్ టూ పిన్ తన బాధను మహిళలకు వివరించారు. అలానే మూడు రోజులు పర్యటనలో భాగంగా ఆమె చేసిన స్పీచ్ మొత్తం ఎటువంటి స్ర్కిప్ట్ పేపర్ చూడకుండానే మాట్లాడారు. మొత్తంగా ‘నిజం గెలవాలి ’ కార్యక్రమం ఆసాంతం తండ్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వారసత్వం.., మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో నడిచిన అనుభవాలు ప్రస్పుటంగా కనిపించాయి.
చంద్రబాబు అరెస్ట్ తో ఆగిన గుండెలకు భరోసా ఇవ్వడంతో పాటు.. వారిని అన్నీ విధాలుగా ఆదుకుంటామని హామీ ఇస్తూ ముందుకు సాగారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో సాగిన యాత్రలో భువనేశ్వరి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన విధానాన్ని.., తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మహిళలకు వివరించారు. మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చి ధైర్యం కల్పించారు. ఏపీకి స్వాతంత్ర్యం రావాలంటే వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మూడు రోజులు పాటు సాగిన భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని పెంచింది. ఫైనల్ గా నందమూరి.., నారా కుటుంబాల నుంచి మరో శక్తివంతమైన మహిళా నేత బయటకొచ్చారు అని చాటి చెప్పేలా భువనేశ్వరి యాత్ర సాగిందని ఇప్పటికే రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి.