రాజుగారికి యువరాజు చేతిలో ఉన్నా ఉపయోగం లేకపోయింది. ఎవరీ రాజు అనుకుంటున్నారా? ఒకప్పుడు హిట్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఎం.ఎస్. రాజు. కొన్నాళ్లు క్రితం టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ అంటే నిర్మాత ఎమ్.ఎస్. రాజుగారు సినిమా ఉండాల్సిందే. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఎమ్.ఎస్. రాజు సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఓ వెలుగు వెలిగాడు. అయితే వరుస ఫ్లాపులతో సతమతమై ప్రస్తుతం సినీ నిర్మాణ రంగానికి దూరంగా ఉంటున్నాడు. అయితే ఎమ్.ఎస్.రాజు ఇటీవల దర్శకత్వం వహించిన డర్టీ హరి అనే సినిమా రిలీజ్ కి రెడీ అయింది.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కి, వదిలిన పాటల్ని అటు ఇండస్ట్రీలో ఇటు ఆడియెన్స్ లో ఓ వర్గం వారికి బాగా నచ్చేశాయి. ఫ్యామిలీ టైపు సినిమాల్ని నిర్మించి ఎంతో వైభోగం చూసిన ఎమ్.ఎస్. రాజు ఇప్పుడు డైరెక్షన్ లోకి వచ్చేసరికి నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా అడల్డ్ కంటెంట్ మీదనే దృష్టి పెట్టాడు. డర్టీ హరీలో అడల్డ్ సీన్లు, బెడ్ రూమ్ సీన్లతో ఎక్కువ ఉండేలా చూసుకున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోగా తన వారసుడిని కాకుండా ఓ కొత్త కుర్రాడిని హీరోగా తీసుకున్నాడు.
అయితే నిజానికి ఈ సినిమాను తన వారసుడు హీరో సుమంత్ అశ్విన్ తోనే తీద్దామనుకున్నాడట ఎం. ఎస్. కానీ సుమంత్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ అవకాశం వేరే వారికి షిప్ట్ అయింది. సుమంత్ అశ్విన్ కెరీర్ లో ఒక్క సోలో హిట్ కూడా లేదు. కేరింత అనే సినిమా తప్పిస్తే సుమంత్ అశ్విన్ అంటే గుర్తొచ్చే సినిమాలే లేవు. ఎలాగైనా కొడుకు కెరీర్ ను గాడిలో పెట్టడానికి ఎమ్ .ఎస్ . రాజు చాలా ప్రయత్నాలే చేశారు. కానీ ఏ ఒక్కటి వర్కవుట్ కాలేదు. ఇప్పుడు వర్క్ అవుట్ అవుతుందేమో అనే కాన్ఫీడెన్స్ ఉన్న సినిమాను తీసుకొస్తే అందులో యాక్ట్ చేయడానికి సుమంత్ అశ్విన్ ఒప్పుకోలేదు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు.