నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేరతారనే ప్రచారం జరుగుతోంది.. దీనిని ఆయన ప్రస్తుతానికి ఖండిస్తున్నా.. కండువా కప్పుకోవడం గ్యారంటీ అని తెలుస్తోంది.. ఇటు, గుంటూరు తూర్పు ఎమ్‌ఎల్‌ఏ ముస్తాఫా… ఇటీవల ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.. ఇదే రేస్‌లో మరికొంతమంది ఎమ్‌ఎల్‌ఏలు ఉన్నారని సమాచారం..
రాజకీయంలో తెలివితేటలూ ఎప్పుడు,ఎక్కడ వాడాలో ఆదాలది అందె వేసిన చేయి. 2019 ఎలెక్షన్ టిడిపి టికెట్ తెచ్చుకుని వైసీపీలో చేరి ఎంపీ అయిన గొప్ప చరిత్ర ఆయన సొంతం. ఇప్పుడు కూడా వైసీపీ నుంచి టిడిపిలోకి జంప్ చేసిన తరువాతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. ఆదాలకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన అల్లుడినే రాజకీయ వారసుడిగా రంగంలోకి దింపాలని ఆలోచనలో ఉన్నటు తెలుస్తోంది. బెంగళూరులో రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ రంగంలో బాగా సంపాదించిన అల్లుడు పి. చంద్ర కిరణ్ రెడ్డి రాజకీయ అరంగేట్రానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి మార్గం సుగమం చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచే పార్టీ అని ఫిక్సయి వైసీపీలోకి దూకిన ఆదాల, వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచే అవకాశం ఉందని ఆ గూటికి చేరే ప్రయత్నాలు ఆరంభించారని సమాచారం.
అయితే ఈ మధ్య జోరుగా వినిపిస్తాను సమాచారం ఏమిటంటే తెలుగుదేశం అధినాయకత్వంతో చర్చించి ఒక అవగాహనకి వచ్చారని తెలుస్తోంది, ఏ సమయంలోనైనా టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నటు తెలుస్తోంది. దీనికి తెలుగుదేశం ఆదినాకత్వం నుండి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే, ఆదాల ప్రభాక రెడ్డి వైసీపీ ఎంపీ గా గెలిచినా ఏ రోజు కూడా ఆ పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరించలేదనేది అక్షర సత్య, తెలుగుదేశం హయాంలో చేసిన కాంట్రాక్టు బిల్లులు కోట్ల రూపాయలు తన అకౌంట్లోకి పడగానే ప్లేట్ ఫిరాయించాడు,అతనొక అవకాశం రాజకీయవాది అని వైసీపీ నాయకులూ దెప్పి పొడుస్తున్నారు. ఈ వ్యవహార శైలితో వైసీపీ నాయకులకి ఆదాలప్రభాకర్ రెడ్డి కి చెడింది, అందుకే టీటీపీగూటికి చేరబోతున్నట్టు సమాచారం.











