ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పవన్ వారాహి యాత్రతో కాపు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. ఏపీలో సీఎం జగన్‌పై విపక్షాలు ఏకమవుతున్నాయి. టీడీపీ, జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయమైంది. ఈసారి ఏపీ ఎన్నికల్లో కాపు ఓటింగ్ కీలకంగా మారుతోంది. పవన్ కాపు ఓటింగ్ ను తనవైపు తిప్పుకుంటాడనే అంచనాలు ఉన్నాయి. వైసీపీ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తోంది.
ఏపీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో సోషల్ ఇంజినీరింగ్ అమలు చేసి జగన్ 151 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు జగన్‌ను ఢీకొట్టింది చంద్రబాబు ఒక్కడే.
ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల నుంచి వారాహి యాత్ర ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పిలుపునిస్తున్నారు. కీలకమైన కాపు ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని జనసేన భావిస్తోంది. అయితే ముద్రగడ, వైసీపీ, జనసేన మద్దతుదారులుగా కాపు ఓటింగ్‌లో కొంత గ్యాప్ కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీలో కొత్త స్కెచ్ అమలు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.
ఈ సమయంలో ఏపీలో రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారం దక్కించుకోవడంలో నిర్ణయాత్మకమైన కాపు ఓటింగ్‌పై చర్చ జరిగినట్లు సమాచారం. కాపు ఓటర్ల మద్దతు, బీఆర్‌ఎస్‌లో కాపు నేతల చేరిక అంశంపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్, చంద్రబాబు పొత్తు… వైసీపీకి కాపు ఓట్ల మద్దతు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటె కాపు సామజికవర్గం ఓట్లు కొల్లగొడితే సునాయాసంగా గెలుపు సాధించొచ్చు అని తెలుస్తోంది, అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన చిన్న, చితక, గల్లీ లీడర్స్ ని కూడా వదలకుండా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తునట్టు సమాచారం, ఆమధ్య జరిగిన మ్మెల్సీ ఎలెక్షన్ వైసీపీ అభ్యర్థి ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ అధినాయకత్వం , మీ వల్లనే మా అభ్యర్థి ఓడిపోయాడుఅని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు తెలుస్తోంది.











