దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తితో ఇక్కట్లు పడుతున్న దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ అందించనుంది. అయితే ఇప్పటివరకు 60 ఏళ్లు పైబడిన వారందరికీ మాత్రమే కొవిడ్ వ్యాక్సిన్ అందించింది. తాజాగా 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీళ్ళందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఏప్రిల్ 1 నుంచి ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు.
Must Read ;- ప్రజల నిర్లక్ష్యంతోనే పెరుగుతున్న కరోనా కేసులు