దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 10.63లక్షల పరీక్షలు చేయగా.. 35,871 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,74,605 కి చేరింది. కొత్తగా 17,741 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,63,025కు చేరి.. రికవరీ రేటు 96.65శాతం నుంచి 96.56శాతానికి తగ్గింది. మరోవైపు కరోనా మరణాలు మంగళవారంతో పోలిస్తే గత రోజు కొంతమేర తగ్గాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 3,71,43,255కి చేరింది.
Telangana Corona Cases Update :
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్నటివరకు 59,905 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 278 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 3,02,047కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు అంటున్నారు.
Must Read ;- వెల్ఫేర్ హాస్టల్లో కరోనా కలకలం.. 38 మంది విద్యార్థులకు వ్యాధి