లోకేశ్ కేవలం అంకెలే లక్ష్యంగా నడవడం లేదు. ప్రజలతో మమేకమయ్యేందుకు, వారి నుంచి ప్రశ్నలు తీసుకోవడానికి, వారి సమస్యలను వింటూ, ఎదురుచూడలేకపోతే అప్పటికప్పుడు ప్రసంగిస్తున్నాడు. తన విజన్‌ని, రాష్ట్రంపై టీడీపీ విజన్‌ని కూడా ప్రజలకు వివరిస్తున్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టో, భవిష్యత్తుకు హామీని కూడా ఆయన తన ప్రసంగాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
అయితే వైసీపీ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నారా లోకేష్ పాదయాత్ర పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ పాదయాత్ర వాళ్ళ నెల్లూరులో వైసీపీ కి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు సమాచారం. టీడీపీకి లాస్ట్ ఎలక్షన్ కంటే కూడా వచ్చే ఎలక్షన్లో టీడీపీ దూసుకుపోతోందని తెలుస్తోంది. ఈ సారి వైసీపీ , నారా లోకేష్ పాదయాత్ర సునామీలో కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది..
పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది డిసెంబర్ లోనే ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రతి నియోజకవర్గం నుంచి కొందరు నేతలను ఆహ్వానిస్తున్నారు.
పీలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. జగన్ ఢిల్లీ వెళ్లి ముందస్తుపై బీజేపీ నేతలతో లాబీయింగ్ చేస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీని జగన్ వేడుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది డిసెంబర్ లోనే ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
గతంలో పార్టీ చేసిన సర్వే నివేదికలు, పార్టీ వ్యూహకర్తలు చెప్పిన సమాచారం, ప్రస్తుతం సేకరించిన వివరాల ఆధారంగా అభ్యర్థుల కూర్పుపై చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల్లో ప్రజల నాడి, క్యాడర్‌తో మెలిగే నేతలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. గతానికి భిన్నంగా ఈసారి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. మరోవైపు ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సమాచారంతో చంద్రబాబు ఆరు నెలలుగా పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నారా లోకేష్ కూడా యువగళం పేరుతో పాదయాత్రలు చేస్తూ అధికార పార్టీ అవినీతి, దుర్మార్గాలను బయటపెడుతున్నారు. పలు చోట్ల టీడీపీ యువనేతలతో కీలక చర్చలు జరుపుతున్నారు. లోకేష్ స్వయంగా ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు.











