‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతడు నెం. 1 పాన్ ఇండియా స్టార్. బాలీవుడ్ దర్శక, నిర్మాతల కళ్ళన్నీ ఇప్పుడు అతడి మీదే. ‘సాహో’ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. బాలీవుడ్ లో సత్తా చాటుకున్నాడు ప్రభాస్ . అందుకే అతడు ఇండియన్ స్ర్కీన్ కే మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. బాలీవుడ్ అగ్ర దర్శకులు, నిర్మాతలు ప్రభాస్ తో సినిమాలు తీయడానికి వ్యూహరచన చేస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. భారీ స్థాయిలో ‘ఆదిపురుష్’ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో భూషణ్ కుమార్ లాంటి అగ్రనిర్మాత రంగంలోకి దిగాడు. మరోవైపు కరణ్ జోహార్, ఆదిత్యా చోప్రా లాంటి అగ్ర నిర్మాతలు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరిలో ఆదిత్య చోప్రా ప్రభాస్ నుంచి కమిట్ మెంట్ తీసుకున్నాడని, త్వరలోనే ఓ భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం చేస్తున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ 24 గా తెరకెక్కనున్నఈ పాన్ ఇండియా సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇంతకీ ప్రభాస్ తో స్ర్కీన్ షేర్ చేసుకోబోయే మరో సూపర్ హీరో ఎవరో తెలుసా? ఇంకెవరు హృతిక్ రోషన్. వీరిద్దరితో భారీ మల్టీస్టారర్ తీయడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ముందుకొచ్చింది. గతంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ తో వార్ సినిమా తెరకెక్కించిన బ్రిలియంట్ డైరెక్టర్ ఆనంద్ ఈ సినిమాకి దర్వకత్వం వహించబోతున్నాడట. దాంతో ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ స్థాయి మరింతగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ వార్తల్లో నిజా నిజాలేంటో తెలియాలంటే .. మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
Must Read ;- పారితోషికంలో ప్రభాస్ ఖాన్ త్రయాన్నే మించిపోయాడా?