May 31, 2026 11:49 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

‘మంగళవారం’లాంటి సినిమా తీయడం సులభం కాదు: అజయ్ భూపతి

దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా 'మంగళవారం' సినిమా ఈ వారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు.

November 13, 2023 at 5:11 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌ పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ సంస్థ చిత్రాన్ని నిర్మించింది. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన తారాగణం. నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మీడియాతో మాట్లాడారు.

‘మంగళవారం’ ఐడియా ఎప్పుడు వచ్చింది? కథకు స్ఫూర్తి ఏమిటి?

ఐడియా ఎప్పుడు వచ్చిందనేది పర్టిక్యులర్ గా చెప్పలేను. మైండ్ లో చాలా ఐడియాలు రన్ అవుతూ ఉంటాయి. అయితే… ‘మహాసముద్రం’ చిత్రీకరణలో ఉండగా, మంగళవారం చేయాలని ఫిక్స్ అయ్యాను. మరొక కథపై మనసు వెళ్ళలేదు. ఇంతకు ముందు రెండు సినిమాల కంటే కథ రాసేటప్పుడు, తీసేటప్పుడు ఎక్కువ టెన్షన్ ఫీలయ్యా. కాంటెంపరరీ కథతో క్యారెక్టర్ బేస్డ్ సినిమాగా కమర్షియల్ విలువలతో తీశా. నెక్స్ట్ లెవల్ లో ఎండ్ అవుతుంది. ఇటువంటి సినిమాకు దర్శకత్వం వహించడం అంత సులభం కాదు. ప్రొడక్షన్ అండ్ టెక్నికల్ వేల్యూస్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ వంటివి చాలా ఉంటాయి. విజువలైజేషన్ నాకు తప్ప సినిమాటోగ్రాఫర్ కి కూడా తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా అంతే! సినిమాకు అన్నీ కుదిరాయి.

పాయల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

ఆమె క్యారెక్టర్ చూసి ప్రేక్షకులందరూ షాక్ అవుతారు. దాంతో పాటు భావోద్వేగాలు కూడా ఉంటాయి. జీవితంలో మళ్ళీ చేయలేనటువంటి పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చేసింది. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు, మిగతా వాళ్ళు అందరినీ ఒక్క తాటిపైకి తీసుకు రావడానికి నాకు కొంచెం కష్టమైంది. కమర్షియల్ సినిమాలు ఒక మీటర్ మీద వెళతాయి కాబట్టి చేయడం కష్టం కాదు. కానీ, ఇటువంటి సినిమాలు తీయడం కష్టం.

కథానాయికగా ముందు నుంచి పాయల్‌ను అనుకున్నారా?

లేదు. టీనేజ్ ఎండింగ్ లో ఉన్న అమ్మాయితో చేద్దామని అనుకున్నా. ఎటువంటి అంచనాలు లేని కొత్తమ్మాయిని తీసుకుందామని ప్రయత్నించా. సుమారు 40, 50 మందిని ఆడిషన్ చేశా. పెర్ఫార్మన్స్ చేయాలి, ఇన్నోసెంట్ ఫేస్ ఉండాలి, గ్రామీణ నేపథ్యానికి ఆ అమ్మాయి సూటవ్వాలి. ప్రీ ప్రొడక్షన్ టైంలో హీరోయిన్ సెలెక్షన్ కోసం ఎక్కువ టైం పట్టింది. ఆ సమయంలో పాయల్ నుంచి మెసేజ్ వచ్చింది. మళ్ళీ మనం సినిమా చేద్దామని! రెండు రోజులు టైం తీసుకుని నేను విజువలైజ్ చేసుకున్నా. సెట్ అవుతుందా? లేదా? అని! ఆ తర్వాత ఓకే చేశా.

టిపికల్ క్యారెక్టర్ కదా! పాయల్ ను ఎలా ఒప్పించారు?

తనకు నా మీద ఉన్న నమ్మకం. ఆల్రెడీ ‘ఆర్ఎక్స్ 100’ చేసింది కదా! ఆ సినిమాకు కూడా చాలా మందిని ఆడిషన్ చేశాం. చాలా మందికి కథలు చెప్పాం. అయితే… భయపడ్డారు. అప్పుడు పాయల్ ధైర్యంగా ముందడుగు వేసింది. ఇప్పుడూ అంతే!

మహిళలకు సంబంధించిన అంశాన్ని డిస్కస్ చేశానని చెబుతున్నారు. సహజంగా తమ సమస్యలను ఎవరూ బయటపెట్టారు. ఇటువంటి సినిమా చేయడానికి…

రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఎబెట్టు సీన్లు ఉంటాయి. ఇటువంటి డార్క్ థ్రిల్లర్ సినిమాల్లో ఏం ఉండవు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఏవేవో ఉంటాయని చాలా మంది ఊహించుకున్నారు. ఆ సినిమాలో ఏముంది? ప్రేక్షకుల మీద క్యారెక్టర్స్ ఇంపాక్ట్ చూపించాలి. అది ముఖ్యం. ‘మంగళవారం’లో జీరో ఎక్స్‌పొజింగ్. నా జీవితంలో ఒక్క వల్గర్ షాట్ తీయలేదు. పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే… న్యూడ్ అని కొందరు అన్నారు. కానీ, అందులో గమనిస్తే… కళ్ళలో ఏడుస్తూ ఉంటుంది. ఆ గాఢత చూసే వాళ్ళకు తెలుస్తుంది. ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద దర్శకులు ఫోన్ చేసి ‘బ్యాక్ చూద్దామని పోస్టర్ ఓపెన్ చేస్తే కళ్ళ మీదకు తీసుకువెళ్ళావ్’ అని అన్నారు. థియేటర్ల నుంచి వచ్చే ప్రేక్షకులు ఏడుస్తూ వస్తారు. ఆమెను చూసి ఫీల్ అవుతారు.

మాస్క్ వెనుక కథ ఏంటి?

పాయల్, నందిత కాంబోలో ఒక్క సీన్ కూడా లేదంట! ట్విస్ట్ అదేనా?సినిమాలో ఒక్క ట్విస్ట్ కాదు, చాలా ఉన్నాయి. మాస్క్ వెనుక ఎవరు ఉన్నారో చూస్తే షాక్ అవుతారు. లాస్ట్ 45 నిమిషాలు నెక్స్ట్ లెవల్ ట్విస్టులు ఉంటాయి. మ్యూజిక్ కూడా అద్భుతం. ‘రంగస్థలం’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్న సౌండ్ డిజైనర్ ఎంఆర్ రాధాకృష్ణ గారు మంగళవారానికి నెక్స్ట్ లెవల్ లో చేశారు. థియేటర్లలో భారీ సినిమా చూస్తున్నట్లు ఉంటుంది.

సంగీత దర్శకుడు అజనీష్ ఛాయస్ ఎవరిది?

వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?సూపర్బ్ మ్యూజిక్ డైరెక్టర్! ‘కాంతార’ విడుదలైన వారానికి ఆయన దగ్గరకు వెళ్ళా. ఇళయరాజాను మించిన మెలోడీ ఎవరు ఇవ్వలేరు. కొత్త సౌండింగ్ ట్రై చేయమని చెబుతా. ‘గణగణ మోగాలిరా’ పాటలో కొత్త సౌండింగ్ ఇచ్చారు. ఆరు రోజులు ఆ పాట తీశాం. 400 షాట్స్ ఉంటాయి. థియేటర్లలో పాట వచ్చినప్పుడు పూనకాలు వస్తాయి. నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్ ఇచ్చారు.

‘అప్పుడప్పుడు తాండ్ర…’ పాట ఫైనల్ కట్ నుంచి తీసేయడానికి కారణం?

చాలా మంది మనోభావాలు దెబ్బ తీసేలా లిరిక్స్ ఉంటాయని సెన్సార్ ఆఫీసర్లు ఫీలయ్యారు. సినిమాకు ఒక్క కట్ కూడా ఇవ్వలేదు. విజువల్ గానీ, సౌండ్ గానీ తీయమని చెప్పలేదు. ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. హారర్ టచ్ ఉన్న సినిమాల్లో సౌండ్ భయపెట్టేలా ఉంటాయని, అందుకని ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చామని చెప్పారు. కానీ, పాటలో లిరిక్స్ మార్చమని అడిగారు. మారిస్తే ఇంపాక్ట్ ఉండదని సినిమాలో నుంచి తీసేశా. రెండు మూడు రోజుల్లో ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేస్తాం.

ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ నుంచి ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ సినిమా రేంజ్ ముందు ఊహించారా?

సినిమా రేంజ్ నేను ముందు ఊహించకపోతే 20 కోట్లు ఖర్చు పెట్టను. మేం పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్ని ఏరియాల బిజినెస్ పూర్తి అయ్యింది. మేం చాలా హ్యాపీ. అజయ్ భూపతి ఇంత ఖర్చు చేస్తున్నాడేంటని బయట వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ, నేను అనుకోలేదు. ఒక షెడ్యూల్ అయ్యేసరికి ఈ సినిమా కెపాసిటీ నాకు తెలిసింది. ఏ దర్శకుడికి అయినా ముందు తెలుస్తుంది. అల్లు అర్జున్ గారికి ఏడాదిన్నర క్రితమే కథ చెప్పాను కాబట్టి ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఆయన ఊహించారు.

పల్లెటూళ్లలో ఇంకా డార్క్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా! వాటిని కూడా చూపిస్తారా?

‘మంగళవారం’ సినిమాకు పొడిగింపు అయితే ఉంటుంది. సీక్వెల్, ప్రీక్వెల్, ఫ్రాంచైజీ… ఏం అంటారో నాకు తెలియదు. ఎక్స్‌టెన్షన్ అయితే ఉంటుంది.

‘మంగళవారం’ అంటే సమాజంలో ఓ అభిప్రాయం ఉంది. ఆ టైటిల్ పెట్టడం వెనుక…

మంగళవారం శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. ముందు మనకు ఆ రోజు సెలవు ఉండేది. బ్రిటీషర్ల వచ్చి ఆదివారం సెలవు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే పెద్ద వంశీ గారు ఫోన్ చేశారు. ”మంచి టైటిల్ అజయ్! నేను చాలాసార్లు ఆ టైటిల్ పెడదాం అంటే నిర్మాతలు ఒప్పుకోలేదు” అన్నారు. ఆయన నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా ఉంది.

‘మహాసముద్రం’ హిట్టయినా ఈ సినిమా తీసేవాడిని అన్నారు!

అవును. ఆ సినిమా చేసేటప్పుడు అదితిరావు హైదరికి కూడా కథ చెప్పా. ఆమెను చేయమని అడగలేదు. ఫిమేల్ ఓరియెంటెడ్ కథ కాబట్టి ఆమె ఎలా ఫీలవుతుందో అని చెప్పా. వెంటనే చేస్తానని అంది. తర్వాత నేను కాంటాక్ట్ చేయలేదు.

ఈ సినిమాతో మీరు నిర్మాతగా మారారు!

నాకు ప్రొడ్యూస్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ‘మహాసముద్రం’ తర్వాత ఈ ‘మంగళవారం’ నేనే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నా. మా బ్రదర్ సురేష్ వర్మ గారికి చెబితే ‘అజయ్! మేం కూడా సినిమా చేద్దామని అనుకుంటున్నాం. కొలాబరేట్ అవుదాం’ అని స్వాతి గారికి పరిచయం చేశారు. ఆవిడ చాలా మంచి వ్యక్తి. నేను ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళకు డబుల్ రెస్పెక్ట్ ఇస్తా. స్వాతి గారు కథ విని చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆవిడ ముందుకు రావడం నాకు ఇంకా బూస్టప్ ఇచ్చింది.

అల్లు అర్జున్ గారికి సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు? మీ గురువు రామ్ గోపాల్ వర్మకి?

బన్నీ గారు చాలా బిజీగా ఉన్నారు. ‘పుష్ప 2’ కోసం భారీ ఎత్తున చిత్రీకరణ జరుగుతోంది. ఆయన ఎప్పుడు చూస్తానంటే అప్పుడు చూపించడానికి రెడీ. మా బాస్ ఎప్పుడూ విడుదలకు ముందు చూడరు. విడుదలైన తర్వాత థియేటర్లలో చూస్తారు.

కార్తికేయతో మళ్ళీ సినిమా ఎప్పుడు? ‘మంగళవారం’లో ఆయన కూడా ఉంటే ‘ఆర్ఎక్స్ 100’కాంబో రిపీట్ అయ్యేది కదా!

పాయల్ ఒకసారి మళ్ళీ మనం సినిమా చేద్దామంటే చేయనని చెప్పా. వాళ్లిద్దరూ హీరో విలన్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. మళ్ళీ వాళ్లిద్దరూ చెట్టపట్టాలు వేసుకుని డ్యాన్స్ చేస్తే ఒప్పుకోరు. నేను కూడా ఒప్పుకోను. ఆ కాంబోలో నేను అయితే సినిమా చేయను. కార్తికేయతో మళ్ళీ సినిమా ఉంటుంది. కుదిరినప్పుడు చెబుతా.

‘మంగళవారం’తో మీ మీద అంచనాలు పెరిగాయి. మరి, నెక్స్ట్ సినిమా ఏంటి?

జానర్ మార్చేశా. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నా. హీరో ఇంకా ఎవరు ఫిక్స్ కాలేదు.

Tags: director ajay bhupathi about mangalavaram movie
Previous Post

బిగ్ బాస్ విన్నర్ శివాజీయేనా.. మరి రన్నర్?

Next Post

గోవాలో సంతోషం సినీ అవార్డుల వేడుక

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మనిషికి ఎందుకీ తాపత్రయం?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ప్రభాస్, హృతిక్ రోషన్ సంచలన మల్టీస్టారర్ ?

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

Lavanya Tripathi

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

డిస్నీప్లస్ నుంచి డైరెక్టుగా విడుదలకానున్న ఆత్మల కథ ‘సోల్’

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist