ఇప్పటికే పది వారాలు గడిచాయి. గతంలో అభిజిత్ విన్నర్ గా నిలిచిన షోకీ దీనికీ కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అప్పుడు విజేతగా అభిజిత్ నిలుస్తాడని చాలా మంది ముందే ఊహించారు. అందుకు అనుగుణంగానే విజేతగా అతను నిలిచాడు. ఈసారి కూడా ఆ పరిస్థితి ఉంది.
విజేత ఎవరనే విషయంలో అందరి నోటా వినిపిస్తున్న మాట శివాజీ. ఈ సీజన్ లో టాప్ ఫైవ్ గా ఎవరు నిలవబోతున్నారనే దాని మీద కంటెస్టెంట్ల ఫ్యామిలీలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఆ ప్రకారం చూస్తే శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్‌దీప్, ప్రియాంకల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్‌ను దీపావళి స్పెషల్ షోగా నిర్వహించారు. ఇందులో ఎంతో మంది సెలెబ్రిటీ గెస్టులు రంగ ప్రవేశం చేశారు. ముఖ్యంగా కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు, స్నేహితులు స్టేజ్ మీదకు వచ్చి తెగ సందడి చేయడం విశేషం.
అమర్‌దీప్ కోసం వాళ్ల అమ్మ, మానస్ రావడమే కాదు వీరు తమ దృష్టిలో ఉన్న టాప్ 5 ఎవరో చెప్పారు. అలా చూస్తే అమర్‌దీప్, శివాజి, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్‌లకు ఆ లిస్టులో పట్టంకట్టారు. తర్వాత వచ్చిన గౌతమ్ కుటుంబం మాత్రం గౌతమ్ తో పాటు అంబటి అర్జున్, శివాజి, ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి టాప్ 5లో ఉంటారని చెప్పారు. తమ వారిని ఎవరూ వదులుకోలేదు. ప్రిన్స్ యావర్ ఫ్రెండ్స్ కూడా అతడికే విజేతగా పట్టంగట్టారు. ఆ తర్వాత స్థానాల్లో శివాజి, ప్రశాంత్, అమర్, భోలేలను ఉంచారు. అర్జున్ తరపున వచ్చిన వారు కూడా అతడిని విజేతగా చెబుతూ ఆ తర్వాత శివాజి, గౌతమ్, ప్రశాంత్, ప్రియాంకలను నిలిపారు.
తర్వాత అశ్విని ఫ్యామిలీ వారు మాత్రం శివాజీని టాప్‌లో పెట్టి ఆ తర్వాత ప్రశాంత్, అశ్విని, యావర్, అర్జున్‌లకు పట్టంగట్టారు. శివాజీ కుటుంబం గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. శివాజీ భార్య, కొడుకు వచ్చి శివాజీని విజేతగా నిలిపి ఆ తర్వాత ప్రశాంత్, యావర్, అమర్‌దీప్, ప్రియాంకల పేర్లు చెప్పారు. ప్రియాంక తరపున వచ్చిన వారు ఆమె తర్వాత శివాజి, గౌతమ్, యావర్, శోభా శెట్టిలను వరుసలో నిలిపారు. ఇక ప్రశాంత్ కుటుంబ సభ్యుల వంతు వచ్చింది. ప్రశాంత్ తర్వాత శివాజి, యావర్, ప్రియాంక, అమర్‌దీప్‌లు వీరు ఎంపిక చేశారు.
రతికా రోజ్ కుటుంబం మాత్రం ప్రశాంత్‌ను టాప్‌లో పెట్టింది. ఆ తర్వాత శివాజి, యావర్, రతికా రోజ్, అర్జున్‌లను ఉంచారు. శోభా శెట్టి కుటుంబ సభ్యులు కూడా తక్వకు ఆమెను టాప్‌లో పెట్టి ప్రశాంత్, శివాజి, అమర్‌దీప్, ప్రియాంకలను టాప్ 5 కంటెస్టెంట్లు అని అభిప్రాయపడ్డారు. భోలే బ్రదర్ శివాజీని టాప్‌లో పెట్టి తర్వాత ప్రశాంత్, భోలే, యావర్, గౌతమ్‌లను ఎంపిక చేశారు. అలా చూస్తే చాలామంది ఓటు శివాజీ వైపే పడింది. లేదా రెండో స్థానంలో అతన్ని పెట్టారు.
అలా శివాజీకి 11 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రశాంత్ నిలిచాడు. ప్రిన్స్ యావర్‌కు 7 ఓట్లు, అమర్‌దీప్ చౌదరికి 6 ఓట్లు, ప్రియాంక జైన్‌కు 6 ఓట్లు, గౌతమ్‌కు 5 ఓట్లు లభించాయి. ఆ ప్రకారం చూస్తే శివాజీ, ప్రశాంత్, యావర్, ప్రియాంక, అమర్‌దీప్, గౌతమ్‌లు కచ్చితంగా ఫైనల్ జాబితాలో ఉండే అవకాశం ఉంది. అలా చూసినప్పుడు విన్నర్ గా శివాజీ, రన్నర్ గా ప్రశాంత్ ఉండే ఛాన్స్ ఉంది. అంతిమ నిర్ణయం ప్రేక్షకుల ఓట్లే కాబట్టి అదెలా ఉంటుందో చూడాలి. మెచ్యూర్డ్ గా మాట్లాడటం, జెన్యూన్ గా ఉండటం శివాజీకి ఉన్న ప్లస్ పాయింట్లు. గ్రూప్ గేమ్స్ ఆడకుండా జెన్యూన్ గా ఆడటమే శివజీ విన్నర్ అనడానికి ఆధారం. అభిజిత్ లాగా శివాజీకి ఫాలోయింగ్ పెరగడానికి కారణం అదే. అందుకే ఈసారి బిగ్ బాస్ 7లో విన్నర్ గా పట్టం కట్టేది శివాజీకే అని స్పష్టంగా చెప్పవచ్చు.