వైఎస్ఆర్ సీపీ నేతల్లో అధిక మంది కామాంధులు ఇప్పటి వరకూ అడ్డంగా బుక్ అయ్యారు. ఈ రేంజ్‌లో లైంగిక వాంఛగల నేతలు మరే రాజకీయ పార్టీలోనూ బహుశా బయపడలేదు. మొదటిసారిగా అవంతి శ్రీనివాస్ నుంచి మొదలుపెడితే, అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, జారదొడ్డి సుధాకర్ వంటి వారు అడ్డంగా దొరికిపోగా.. విజయసాయి రెడ్డిపై విపరీతమైన అక్రమ సంబంధపు ఆరోపణలు వచ్చాయి. ఈ మధ్యే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కుటుంబ వ్యవహారం రచ్చ లేపుతోంది. ఇప్పుడు మరో వైసీపీ మాజీ ఎంపీ భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్లు బయటికి రావడం కలకలం రేపుతోంది.
విశాఖ నగరంలోని శివాజీపాలెంలో ఉన్న మాజీ ఎంపీకి చెందిన భవనంలో నడుస్తున్న హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. అక్కడ ముగ్గురు మహిళలను గుర్తించి వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో నేరాలు చేసిన నిందితులు విశాఖపట్నంలో ఉంటున్నారన్న సమాచారంతో నగర సీపీ శంఖబ్రత బాగ్చీ.. హోటళ్లు, లాడ్జీలపై ఫోకస్ చేశారు. నగరం నలుమూలలా 400 మంది సిబ్బంది 80 టీమ్ లుకా ఏర్పడి.. 121 లాడ్జీలు, హోటళ్లు తనిఖీ చేయించారు.
ఈ క్రమంలో నాలుగుచోట్ల 10.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణకు శివాజీపాలెంలో ‘ఎంవీవీ భవన్’ పేరుతో 5 అంతస్తుల బిల్డింగ్ ఉండగా.. దీనిలో ఒక ఫ్లోర్ లో ‘క్రెడాయ్’ ఆఫీసు నడుస్తోంది. మిగిలిన నాలుగు ఫ్లోర్లలో హోటల్ ఉండగా.. అందులో వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించారు. ఈ విషయమై ఎంవీపీ స్టేషన్ పోలీసులు మాట్లాడుతూ.. ఎంవీవీ భవన్‌లో నడుస్తున్న హోటల్‌లో తనిఖీలు నిర్వహించినప్పుడు వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించినట్లు చెప్పారు. అక్కడ ముగ్గురు మహిళలను, హోటల్ నిర్వాహకుడు సుశాంత్‌ను, మహిళలను తీసుకువచ్చిన మహేశ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
నాలుగు అంతస్తుల్లో గదులు అద్దెకు తీసుకొని, నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా గుర్తించారు. అయితే, ఈ దందా ఎప్పటి నుంచి సాగుతుంది? ఈ విషయం భవన యజమాని ఎంవీవీకి తెలియకుండానే జరుగుతుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనంలో పట్టుకున్న నిందితుల ద్వారా మరింత సమాచారం రాబట్టుకొని, దీని వెనక ఎవరెవరు ఉన్నారనే అంశాలను పోలీసులు బయటికి లాగనున్నట్లు తెలుస్తోంది.











