‘ఈ రోజుల్లో’ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా ప్రవేశించిన మారుతి.. తొలి ప్రయత్నంలోనే తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘బస్టాప్’ మూవీతో కూడా యూత్ ను బాగా ఆకట్టుకోవడంతో.. దర్శకుడిగా మారుతి పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగింది. ఆపై నానీతో ‘భలేభలే మగాడివోయ్’, వెంకీతో ‘బాబు బంగారం’ , నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలు తీసి.. స్టార్ స్టాటస్ పెంచుకున్నారు. ఎర్లియర్ గా ‘ప్రతిరోజూ పండగే’ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న మారుతి త్వరలో.. ఓ స్టార్ హీరోతో సినిమా తీయబోతున్నారు. రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నారు మారుతి. ఈ సందర్భంగా ఆయన మనసులోని మాటలు ఏంటో తెలుసుకుందాం…
* కరోనా కారణంగా వచ్చిన ఈ కాళీ సమయాన్ని నా వరకు నేను క్రియేటివ్ గా మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకున్న, స్టోరీ డిస్కషన్స్, కొన్ని కొత్త కథలు రాసుకున్న, ముందు మాదిరిగా ఒక స్టోరీ తరువాత మరో స్టోరీ ని రెడీ చేసే పద్దితి నుంచి కాస్త బయట పడ్డాను, ఇప్పుడు నా చేతిలో ఒక మూడు నాలుగు కథలు ఉన్నాయి, అన్ని సెట్స్ మీదకి తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
* ప్రొడక్షన్ పరంగా కొంత ఇబ్బంది ఉన్నపటికీ, ఆడియన్స్ సినిమాలు చూడటం ఆపలేదు, కొత్త కొత్త జెనెర్స్ చూస్తూ ఉన్నారు, ఐతే సినిమా నిర్మాణంలో ఆర్ధిక పరమైన ఇబ్బందులు వచ్చాయి, అవి కూడా ఇప్పుడు ఓవర్ కం అయ్యి అంత సాధారణ స్థితికి వచ్చింది అని నేను భావిస్తున్న.
* అసలు లేకపోవడం కంటే ముందు ఒకరు వచ్చిన బొమ్మ వేయడం మొదలు పెట్టడం నయం కదా, ఇప్పుడు 50 శాతం ఆడియన్స్ తో థియేటర్స్ నడిపించే అవకాశం దొరికింది, ఇది కచ్చితంగా శుభ పరిణామం, జనవరికి 100 శాతం ఆడియన్స్ తో థియేటర్స్ తెరిచే పరిస్థితి వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్న
* నా మాతృ సంస్థలు యూవీ క్రియేషన్స్, గీత ఆర్ట్స్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న, ఫిబ్రవరి నుంచి షూటింగ్ కి వెళ్తున్న ఇంక కొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి, త్వరలోనే ఆ విషయాలు కూడా వెల్లడిస్తాను.
* ఓ వెబ్ సిరీస్ కి స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్న, ఇది ఓ కొత్త టీం చేస్తున్నారు.
* ఎన్ని వచ్చిన థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ని ఏది ఇవ్వలేదు, ఐతే ఓటిటి కారణంగా కూడా ఉపయోగాలు ఉన్నాయి, కొత్త టాలెంట్ వస్తున్నారు, కొత్త కథలు, కొత్త రకమైన ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి అందుతుంది.











