టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. నారా లోకేష్ ఏపీలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ తుఫాను బాధిత రైతులను , ప్రజలను పరామర్శిస్తూ ఓదార్చుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జల్లాలో పర్యటించారు. బాధితులను పరామర్శిస్తూ ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద స్వయంగా ఆయన ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి ఉప్పుటేరు కాలువలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపుచేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్ నుంచి దింపేశారు. దీంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!
తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...











