ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా ఒక కుటుంబంతోపాటు, మరోవైపు ఆ కుటుంబంతో ఏ మాత్రం సంబంధంలేని మరో ఇద్దర్ని కూడా నిందితుడు సంజయ్ చంపేశాడు. అందర్నీ స్పృహా తప్పేలా చేసి బావిలో తోసి ప్రాణాలు తీశారు. వరంగల్‌లోని గొర్రెకుంటలో మే నెలలో జరిగిన ఈఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించింది. అయితే ఈకేసుపై తాజాగా తీర్పు వెలువరించిన న్యాయస్థానం సంజయ్ ను దోషిగా తేలుస్తు ఉరిశిక్ష విధించాలని తీర్పు వెల్లడించింది. భారీ బందోబస్తు మధ్య నిందితుడు సంజయ్ కుమార్‌ను పోలీసులు కోర్టుకు తరలించారు. ఈరోజు తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
వరంగల్ 9 హత్యల కేసు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడింది. నిందితుడికి సరైనా శిక్ష పడిందనే అభిప్రాయాన్ని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. ముందు నుంచి అనుకున్నట్లుగానే నిందితుడికి ఉరి లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని అందరూ భావించారు. ఊహించిన విధంగానే సంజయ్‌కు ఉరిశిక్షను కోర్టు విధించింది. గత మే 21న వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో 9మందికి నిందితుడు మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు గా ఉన్న బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌కు వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు నేడు ఉరిశిక్షను ఖరారు చేసింది. నిందితుడిపై వివిధ 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి నెల రోజుల్లో కోర్ట్‌లో చార్జ్ షీట్ దాఖలు చేశారు. పెళ్లివిషయమై ఓ మహిళను హత్యచేసిన విషయం బయటికి రాకుండా ఉండేందుకు నిందితుడి ఇలా వరుస హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మృతుల వివరాలు.
1.మసూద్ ఆలం(50)
2. నిషా ఆలం, భార్య
3.భూస్రా ఆలం, కుమార్తె
4. 3సంవత్సరాల బాబు
5.శబాబ్ ఆలం, కుమారుడు
6. సోహిల్ ఆలం, కుమారుడు.
7.షకీల్ డ్రైవర్
8. శ్రీ రాం, తోటి కార్మికుడు.
9.శ్యామ్, తోటి కార్మికుడు.











