హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అయితే గత కొన్ని నెలలుగా యూనివర్సిటీ కేంద్రంగా కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుండడం ఆ యూనివర్సిటీ పేరు వివాదాస్పదంగా మారుతోంది. గతంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని ఘటనలు జాతీయ స్థాయిలోనూ చర్చగా మారాయి.
అయితే ఇప్పడు తాజాగా హెచ్‌సీయులో మరో ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. హదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏకంగా ప్రొఫెసరే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మెడికల్ సైన్స్ విభాగానికి చెందిన రిషి భరద్వాజ్ యూనివర్సిటీలోనే పనిచేస్తున్నారు. యూనివర్సిటీలోని తన క్వార్టర్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. గతంలోనూ వర్సీటీలో కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రొఫెసర్ ఆత్మ హత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.











