భవిష్యత్తును ముందుగా ఊహించి చెప్పే శాస్త్రాలు జ్యోతిషం, హస్తసాముద్రికం. వీటి మీద చాలా మందికి నమ్మకం ఉంది. కొందరైతే వీటిని గుడ్డిగా ఫాలో అవుతారు. మరికొందరికి మహా సెంటిమెంట్. రియల్ లైఫ్ లో అది ఎంతమందిని ప్రభావితం చేసినా కానీ.. రీల్ లైఫ్ లో మాత్రం దానికి ఏమంతగా లైఫ్ లేదని కొన్ని సినిమాలు నిరూపించాయి. అయితే .. ఈ కాన్సెప్ట్ ను కామెడీగా తీసుకున్న చిత్రాలు కొన్ని విజయవంతమయ్యాయి. ముఖ్యంగా ఈవీవీ సత్యనారాయణ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. అలాగే.. అంతకు ముందు పద్మనాభం స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘జాతకరత్న మిడతంబొట్లు’ సినిమా కూడా కామెడీగా తెరకెక్కి మంచి విజయం సాధించింది. అయితే జ్యోతిష్యం ప్రధానాంశంగా .. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ గానూ , థ్రిల్లర్ జోనర్ లోనూ తెరకెక్కిన కొన్ని సినిమాలు అంతగా సక్సెస్ కాలేకపోయాయి. బాలకృష్ణ, ప్రియమణి ‘మిత్రుడు’, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష పండితుడు నోస్ట్రడామస్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెరకెక్కించిన ‘రిలాక్స్’, మొన్నీమధ్య కాలంలో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం ‘సాక్ష్యం’, సునీల్ హీరోగా వచ్చిన ‘ఉంగరాల రాంబాబు’ సినిమాలు ఆ కోవలోనివే. అయితే నైంటీస్ లో మమ్ముట్టి హీరోగా నటిచింన ‘సూర్యా ది గ్రేట్’ అనే డబ్బింగ్ సినిమా ఈ కాన్సెప్ట్ తోనే తెరకెక్కి.. మంచి విజయం సాధించడం విశేషం. అయినప్పటికీ .. త్వరలో ఈ కాన్సెప్ట్ తో టాలీవుడ్ లో పలు భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో మొదటగా చెప్పుకోవల్సిన సినిమా బాలకృష్ణ, బోయపాటి కలయికలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం. మోనార్క్ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం రిజిస్టర్ చేశారట. ఇందులో బాలయ్య కవల పాత్రలు చేస్తున్నాడట. అందులో ఒకటి అఘోరా అన్న సంగతి తెలిసిందే. జాతకం ప్రకారం చిన్నప్పుడే విడిపోతారట బాలయ్య కవల పాత్రలు. అందులో ఒక పాత్ర వారణాసిలో పెరుగుతుందట. ఆ సందర్భంలోనే బాలకృష్ణ అఘోరా గా కనిపిస్తారట. లాక్ డౌన్ వల్ల చిత్రీకరణ వాయిదా వేసుకున్న చిత్ర యూనిట్ .. త్వరలోనే మిగతా పార్ట్ షూట్ ప్రారంభించనుందట. ఇక.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న జిల్ రాధాకృష్ణ చిత్రం రాధేశ్యామ్. పీరియాడికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్రీ పండితుడిగా నటిస్తున్నాడట. దీనికి టైమ్ మెషీన్ అంశంతో కూడా లింక్ ఉంటుందట. ఇక ఈ జోనర్లో రానున్న మరో చిత్రం మెగా మేనల్లుడు సాయితేజ హీరోగా ఇటీవలే ప్రారంభమైంది. ఇదివరకు భమ్ బోలేనాథ్ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన కార్తిక్ వర్మ దండు .. ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో .. ఇధి జ్యోతిష శాస్త్ర కథాంశంతో తెరకెక్కబోతోందని స్పష్టమైంది. అలాగే.. పోస్టర్ మీద .. ”సిద్ధార్థ నామ సంవత్సరే.. బృహస్పతి : సింహరాశౌ… స్థిత సమయే.. అంతిమ పుష్కరే” అనే కేప్షన్ ఉండడంతో .. దానికి మరింత బలం చేకూరింది. మరి ఈ మూడు చిత్రాలైనా.. ఆస్ట్రాలజీ పరంగా టాలీవుడ్ కున్న నెగెటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాయేమో చూడాలి.
రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??
మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...











