ప్రేక్షకుల్ని సరికొత్తగా ఎంటర్ టైన్ చేయాలంటే.. దర్శకుడు ప్రయోగాల బాట పట్టాల్సిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. వారి నాడి పట్టుకొంటే.. దర్శకుడు సక్సెస్ అయినట్టే. గతంలో ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ మూవీస్ ను జనం బాగా ఆదరించారు. ఆ తర్వాత ప్రేమకథాచిత్రాలు.. ఆపై యాక్షన్ మూవీస్. ఒక దశలో హారర్ మూవీస్.. జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఇక ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాల వంతు వచ్చింది. సౌత్ సంగతి పక్కనపెడితే.. బాలీవుడ్ మేకర్స్ .. ప్రయోగాలు చేయడంలో ముందుంటున్నారు. ప్రేక్షకులు కూడా ఆ తరహా చిత్రాల్ని స్వాగతిస్తున్నారు… ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో త్వరలో ఓ ప్రయోగాత్మక చిత్రం రాబోతోంది. నేపథ్యం ‘మేల్ ప్రెగ్నెన్సీ’. అంటే మగవాడు గర్భం ధరించి వినోదాన్ని పండిస్తాడన్నమాట. మగవాడేంటి? గర్భం ధరించడమేంటని ఆశ్చర్యపోనక్కర్లేదు. కొంతమంది డాక్టర్లకు నిజజీవితంలో అలాంటి అనుభవాలు ఒకటి రెండు జరిగినట్టు ఆధారాలున్నాయి. అందుకే గతంలో హాలీవుడ్ లో ‘జూనియర్, పెటర్నిటీ లీవ్, మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే సినిమాలు వచ్చాయి. అయితే భారతీయ తెరమీద మాత్రం ఒక్క మలయాళ ఇండస్ట్రీలోనే ఈ కథాంశంతో ఒక సినిమా వచ్చింది. పేరు ‘గర్భశ్రీమాన్’ . నేషనల్ అవార్డు గ్రహీత, కమెడియన్ అయిన సురాజ్ వెంజారమూడ్ అందులో హీరోగా నటించాడు.
ఇప్పుడీ తరహా ప్రయోగం బాలీవుడ్ మేకర్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త దేశమంతా వైరల్ అవుతోంది. ప్రేక్షకులు కూడా ఈతరహా చిత్రంపై ఎంతో ఆసక్తితో ఉన్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జీవిత కథను తెరకెక్కించిన దర్శకుడు షాద్ ఆలీ ఈ సినిమా రూపొందించనున్నాడని టాక్. సూర్మలో ప్రధాన పాత్ర పోషించిన దిల్జిత్ సింగ్ ఇందులో హీరోగా నటించబోతున్నాడు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. గతంలో తెలుగు దర్శకుడు ఇవివి సత్యనారాయణ .. ‘జంబలకిడి పంబ’ అనే చిత్రంలో ఈ తరహా ప్రయోగం చేశారు కానీ.. అది సరదా కోసం సినిమాలో ఒక పార్ట్ గా మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో బాలీవుడ్ లో ఈ తరహా చిత్రం రానుండడం విశేషంగా మారింది. ఇది వరకూ ‘స్పెర్మ్ డొనేషన్, లేట్ ప్రెగ్నెన్సీ’ పై పలు చిత్రాలు తెరకెక్కాయి. మంచి సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలో మేల్ ప్రెగ్నెన్సీ కథాంశాన్ని కూడా బాలీ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. అలాగే మిగతా నటీనటుల ఎంపిక కూడా జరగలేదు. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా గురించి అప్డేట్ విడుదల చేస్తారని టాక్. ప్రస్తుతం ఇటు సినిమాల్ని, అటు వెబ్ సిరీస్ లను అడల్డ్ కంటెంట్ తో నింపేస్తున్న బాలీవుడ్ మేకర్స్ .. ఈ ప్రయోగం సక్సెస్ అయితే .. ఈ తరహాలో మరిన్ని చిత్రాలు తెరకెక్కిస్తారని ఆశిద్దాం. మరి తెలుగులో కూడా ఈ తరహా చిత్రాలు రూపొందుతుతాయేమో చూడాలి.
అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?
అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...