కొణిదెల వారింట బ్యాండ్ బాజా బారాత్ కు సమయం ఆసన్నమైంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్ళి తేదీ, వెన్యూ ఫిక్స్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు సందడిగా మారింది. మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. గుంటూరుకు చెందిన ఐజీ జె. ప్రభాకరరావు కుమారుడు చైతన్యతో నిహారికకు మొన్నీ మధ్యే నిశ్చితార్ధం జరిగింది. ఇప్పుడు ఇరువురి కుటుంబ సభ్యులు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి.
డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయపూర్ లో 5స్టార్ హోటల్ ది ఓబెరాయ్ ‘ఉదయ్ విలాస్ ప్యాలెస్’ లో వివాహం జరగబోతోంది. డిసెంబర్ 9 సాయంత్రం 7: 15కి సుముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ వివాహం కోవిడ్ నిబంధనల నడుమ కట్టుదిట్టమైన భద్రతలను పాటిస్తూ కుటుంబ సభ్యులు, పరిమిత అతిథుల సమక్షంలో వైభవంగా జరుగుతుంది. మెగా ఫ్యామిలీ, చైతన్య ఫ్యామిలీ హాజరు కానున్నారు. చైతన్య హైద్రాబాద్ లోని టాప్ ఐటీ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. మరి నిహారిక వివాహానంతరం సినిమాలు, వెబ్ సిరీస్ లాంటివాటిలో నటిస్తుందో లేదో చూడాలి.











