టాలీవుడ్ చందమామ, సౌత్ అందాల భామ కాజల్ అగర్వాల్ ఇటీవలే పెళ్ళి చేసుకొన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా భర్త గౌతమ్ కిచ్లూ తో హనీమూన్ కోసం మాల్దీవ్స్ కు పయనమైంది. అక్కడ ఆమె భర్తతో ఆనందంగా విహరిస్తోన్న ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది కూడా. పెళ్ళిచేసుకున్నప్పటికీ తాను సినిమాల్లో నటించడం కంటిన్యూ చేస్తానని అభిమానులకు మాటిచ్చింది కాజల్ . దానిపై ఆమె ఏ మేరకు నిల బడుతుందో తెలియదు కానీ.. కాజల్ రీసెంట్ గా ఓ కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కాజల్ పలు వ్యాపారాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సరికొత్తగా ఓకీ అనే గేమింగ్ సంస్థలో భాగస్వామిగా చేరి, ఆ సంస్థలో 15శాతం వాటాను కూడా పొందిందని టాక్. అమ్మాయిల కోసం ప్రత్యేకమైన గేమ్ ను తీసుకొస్తానంటోంది అమ్మడు. ముంబై కేంద్రంగా సాగుతోన్న ఈ గేమింగ్ సంస్థ లో కాజల్ భాగస్వామిగా చేరడానికి కారణం ఆమె భర్త గౌతమ్ కిచ్లూనే అంటున్నారు. మరి అమ్మడి సరికొత్త వ్యాపారం ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.











