(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం ఆగనంపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులోని పారామౌంట్ సన్ లియో కంపెనీలో అగ్ని ప్రమాదం బుధవారం రాత్రి సంభవించింది. ఆయిల్ నిల్వలకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
ఇప్పటికే 2 అగ్నిమాపక పైర్ ఇంజిన్లు మంటలు అదుపు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కార్మికులు ఎవరూ పరిశ్రమలో లేనట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అదృష్ట వశాత్తు ఎటువంటి ప్రాణహాని జరగలేదు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దువ్వాడ పోలీసులు పరిశ్రమకు వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు.
Must Read ;- రోజా ‘కన్నీటి’ కష్టాలకు.. ప్రాధాన్యం తగ్గటమే కారణమా?












